క్రైమ్ మిర్రర్ : కుల్కచర్ల మండల కేంద్రం సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ బైక్ను ఢీకొట్టడంతో పకిరి మల్లిక్ (35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి.
స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం
కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా గదిర్యాల్ గ్రామానికి చెందిన పకిరి మల్లిక్ చికెన్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం కుల్కచర్ల నుంచి తన బైక్పై స్వగ్రామమైన గదిర్యాల్కు వెళ్తుండగా, కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ (నంబర్ TS13UC5888) ఆయన బైక్ను ఢీకొట్టింది. దీంతో మల్లిక్ తలకు తీవ్ర గాయాలై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసుల అదుపులో టిప్పర్ డ్రైవర్
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ రమేష్ కుమార్ తెలిపారు. ఘటనపై పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.
also read: హోటల్ రూమ్కు రావాలంటూ దర్శకుడి ఒత్తిడి.. కెరీర్ మొదట్లో విద్యాబాలన్కు ఎదురైన చేదు అనుభవం!
