Homeక్రైమ్గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు

గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు

క్రైమ్ మిర్రర్ : గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విజయవాడకు చెందిన సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సీబీఐలోని సీనియర్ అధికారితో దర్యాప్తు చేపట్టాలని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించింది. దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

సాయికృష్ణ మృతికి బాధ్యులైన అధికారులను గుర్తించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీబీఐకి సూచించింది. కేసుకు సంబంధించిన పూర్తి రికార్డులను వారంలోగా ప్రత్యేక మెసెంజర్ ద్వారా సీబీఐ డైరెక్టర్‌కు అందజేయాలని ఏపీ డీజీపీని ఆదేశించింది.

మరోవైపు, సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరిగేలా పిటిషనర్‌కు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నేటి నుంచి నాలుగు వారాల్లోగా ఈ మొత్తాన్ని పిటిషనర్ బ్యాంకు ఖాతాలో జమ చేయాలని స్పష్టం చేసింది. సాయికృష్ణ మృతికి కారణమైన అధికారులపై సర్వీస్ నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం అనుమతించింది.
also read : కాంగ్రెస్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం…! 500 గ‌జాల స్థ‌లాల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు గ్రీన్ సిగ్న‌ల్‌…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు