-
352 విదేశీ మద్యం బ్రాండ్లపై..
-
ప్రభుత్వం కీలక ఆదేశాలు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణలో మందుబాబులకు షాక్. మద్యం ధరలు పెరిగాయి. గత కొంతకాలంగా మద్యం ధరల పెంపునకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. అనేక ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం విక్రయిస్తున్న 352 విదేశీ మద్యం బ్రాండ్ల ధరలను ప్రభుత్వం సమీక్షించింది. టెండర్ కమిటీ సమర్పించిన నివేదిక, సిఫారసులను పరిశీలించిన అనంతరం ధరల సవరణకు ఆమోదం తెలిపింది. ఈనెల 12 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్లు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణలో విదేశీ మద్యం ధరలు భారీగా పెరిగాయి. బ్రాండ్ ను బట్టి ఫుల్ బాటిల్ పై 30 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ధర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సగటున ఆరు శాతం వరకు ధరల పెంపు ఖరారు చేశారు. పెరిగిన ధరలు ఎప్పటికీ అమల్లోకి వచ్చాయి.
సమీక్షించిన ప్రభుత్వం…
రాష్ట్రంలో ప్రస్తుతం 352 విదేశీ మద్యం బ్రాండ్లు విక్రయిస్తున్నారు. వీటి ధరలపై ప్రభుత్వం సమీక్షించింది. టెండర్ కమిటీ సమర్పించిన నివేదిక, సిఫారసులను పరిశీలించిన అనంతరం ధరల సవరణకు ఆమోదం తెలిపింది. దీంతో ఆయా బ్రాండ్లను బట్టి మద్యం కొనుగోలు చేసే వినియోగదారులపై అదనపు భారం పడనుంది. అన్ని బ్రాండ్లకు ఒకే విధంగా ధరలు పెంచకుండా.. బ్రాండ్ ను బట్టి ధరలను సవరించారు. ఫుల్ బాటిల్ పై కనిష్టంగా 30 రూపాయల నుంచి గరిష్టంగా 100 రూపాయల వరకు పెంచినట్లు తాజా ధరలు సూచిస్తున్నాయి. సగటున ఆరు శాతం వరకు ధరలు పెరగడంతో విదేశీ మద్యం కొనుగోలుదారులపై అధిక భారం పడనుంది.
ఈనెల 12 నుంచి వర్తింపు…
విదేశీ మద్యానికి సంబంధించి స్కాచ్, సింగిల్ మాల్ట్ విస్కీలు, ప్రీమియం వడ్క, జిన్, వైన్ వంటి దిగుమతి బ్రాండ్ల ధరలు భారీగా పెరిగాయి. డిపోల నుంచి అక్టోబర్ 12 నుంచి సరఫరా అయ్యే ప్రతి స్టాక్ పై సవరించిన ఎమ్మార్పీ స్టిక్కర్లను కచ్చితంగా వేయాలని.. రిటైలర్లు కూడా నూతన ధరల జాబితా ఆధారంగానే విక్రయాలు జరపాలని డిపో మేనేజర్లకు, వైన్స్, బార్ యాజమాన్యాలకు టీజీబీసీఎల్ ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారులు కొనుగోలు చేసే ముందు బాటిల్ పై ముద్రించిన నూతన ఎమ్మార్పీ ధరలు పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవి కూడ చదవండి:
- బాంబుల వర్షం….రక్తమోడిన సుడాన్ సరిహద్దు ప్రాంతం…! 72 మంది మృతి….
-
స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఆహార నాణ్యతపై ఫిర్యాదులు.. గోధుమ పిండిలో ఈగలు, చాక్లెట్లో పురుగు, కేక్పై బూజు!
-
పాక్ నుంచి డ్రోన్లో ఆయుధాల సరఫరా.. రాజస్థాన్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం!
-
కూరగాయలు కొనుగోలు చేస్తుండగా గుండెపోటు.. మార్కెట్లోనే కుప్పకూలి వ్యక్తి మృతి!
