Homeక్రైమ్బ్లూ డ్రమ్ హత్య కేసు.. బాధిత కుటుంబం కీలక నిర్ణయం

బ్లూ డ్రమ్ హత్య కేసు.. బాధిత కుటుంబం కీలక నిర్ణయం

క్రైమ్ మిర్రర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్లూ డ్రమ్ హత్య కేసులో నిందితులైన ముస్కాన్‌ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్‌ శుక్లాకు మేరఠ్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై మృతుడు సౌరభ్‌ రాజ్‌పుత్‌ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమ కుటుంబం గత ఏడాది ఎన్నో కష్టాలను ఎదుర్కొందని సౌరభ్‌ తల్లి రేణు, సోదరుడు రాహుల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సౌరభ్‌ పిల్లల భవిష్యత్తుపై వారు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

సౌరభ్‌కు ముస్కాన్‌ ద్వారా జన్మించిన పెద్ద కుమార్తెను తమ వద్ద పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని రేణు తెలిపారు. అయితే జైలులో ఉండగా ముస్కాన్‌ మరో ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఆ చిన్నారి విషయంలో కుటుంబ సభ్యులు స్పష్టత కోరుతున్నారు. గతేడాది నవంబర్‌ 24న జన్మించిన ఆ బిడ్డకు తండ్రి ఎవరనే అంశంపై సౌరభ్‌ కుటుంబం సందేహాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చిన్నారికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని కోరినట్లు రాహుల్‌ వెల్లడించారు. పరీక్షల్లో ఆ బిడ్డ సౌరభ్‌ కుమార్తె అని నిర్ధారణ అయితే ఆమెను కూడా స్వీకరించేందుకు తమకు అభ్యంతరం లేదని కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం.

అసలేం జరిగింది?

సౌరభ్‌ రాజ్‌పుత్‌, ముస్కాన్‌ రస్తోగికి 2016లో వివాహమైంది. వీరికి 2019లో ఓ కుమార్తె జన్మించింది. అయితే ముస్కాన్‌కు సాహిల్‌ శుక్లాతో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సౌరభ్‌ తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో అతడిని హత్య చేసేందుకు ఇద్దరూ కలిసి ప్రణాళిక రూపొందించినట్లు విచారణలో తేలింది.

2025 మార్చి 3న సౌరభ్‌ను హత్య చేసిన అనంతరం, ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని ముక్కలుగా చేసి సిమెంట్‌, ఇసుక మిశ్రమంతో నింపిన నీలిరంగు డ్రమ్‌లో దాచినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 14 రోజుల తర్వాత ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

కోర్టు కీలక తీర్పు

ఈ కేసులో సుదీర్ఘ విచారణ కొనసాగింది. మొత్తం 126 విచారణల అనంతరం 22 మంది సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన న్యాయస్థానం ముస్కాన్‌, సాహిల్‌లకు మరణశిక్ష విధించింది. తీర్పుతో సౌరభ్‌ కుటుంబం కొంత ఊరట పొందినప్పటికీ, అతడి పిల్లల భవిష్యత్తుపై తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా చిన్నారి పితృత్వాన్ని నిర్ధారించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలన్న కుటుంబం అభ్యర్థనపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
also read : బాంబుల వ‌ర్షం….ర‌క్త‌మోడిన సుడాన్ స‌రిహ‌ద్దు ప్రాంతం…! 72 మంది మృతి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు