Homeఅంతర్జాతీయంబాంబుల వ‌ర్షం....ర‌క్త‌మోడిన సుడాన్ స‌రిహ‌ద్దు ప్రాంతం...! 72 మంది మృతి....

బాంబుల వ‌ర్షం….ర‌క్త‌మోడిన సుడాన్ స‌రిహ‌ద్దు ప్రాంతం…! 72 మంది మృతి….

ఢిల్లీ, క్రైమ్‌మిర్ర‌ర్‌: సుడాన్‌- ఈజిప్టు స‌రిహ‌ద్దు ప్రాంతం బాంబుల వ‌ర్షంతో దద్ద‌రిల్లింది. బంగారం కోసం వెళ్లిన కార్మికుల‌పై హ‌ఠాత్తుగా యుద్ద‌విమానం జ‌రిపిన దాడిలో 72 మంది ఘ‌ట‌న స్థ‌లంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి స‌మ‌యంలో అక్క‌డే వేలాది మంది కార్మికులు ప‌ని చేస్తుండ‌గా ఒక్క‌సారిగా మృత్యువు రూపంలో యుద్ద‌విమానం రావ‌డంతో ప్రాణాలు కాపాడుకునేందు కార్మికుల రోద‌న‌లు, ప‌రుగులు తీసిన భ‌యాన‌క దృష్యాల‌తో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగింది. కాగా దాడికి ఈజిప్టు వైమానిక ద‌ళ‌మే కార‌ణ‌మ‌ని సుడాన్ మాన‌వ హ‌క్కుల సంస్థ ఎమ‌ర్జెన్సీ లాయ‌ర్స్ ఆరోపించింది.

సూడాన్‌-ఈజిప్ట్‌ వివాదాస్పద సరిహద్దు జబల్‌ అల్‌-ఉకైదత్‌ ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఉదయం 8 గంటల సమయంలో ఆకాశంలో విమానం కనిపించిందని వరుసగా ఐదుసార్లు జరిపిన దాడులు జ‌రిపిన‌ట్లు యూసుఫ్ అనే కార్మికుడు మీడియాకు తెలిపారు. ఇంకా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి ఉంటార‌ని పేర్కొన్నారు.దాడి మొదలవగానే ప్రాణాలు కాపాడుకునేందుకు అందరూ తలా ఓ దిక్కుకు పరుగులు తీశారనీ చెప్పాడు. కాగా జబల్‌ అల్‌-ఉకైదత్‌లో ఈ ఏడాది వైమానిక దాడి జరగడం ఇది రెండోసారి. గత జూన్‌లోనూ ఇదే ప్రాంతంలోని అక్రమ బంగారు తవ్వకాల గనిపై దాడి జరిగిన ఘటనలో 23 మంది కార్మికులు మృతి చెందారు.

ఎందుకు ఈ వివాదం…

స‌రిహ‌ద్దు విష‌యంలో సుడాన్‌-ఈజిప్టుకు గ‌త కొంత‌కాలంగా వివాదం జ‌రుగుతుంది.ఈ ప్రాంతంలో అపార‌మైన ఖ‌నిజ సంప‌ద బంగారు గ‌నులు ఉండ‌డంతో హలాయెబ్‌ ట్రయాంగిల్ పై ప‌ట్టు సాధించుకునేందుకు ఇరు దేశాలు హ‌క్క‌లు కోరుతున్నాయి. కాగా ఈ ప్రాంతం వ్యూహాత్మ‌కంగా కీల‌కం కావ‌డంతో రెండు దేశాల మ‌ధ్య వివాదం కొన‌సాగుతుంది. ఇదిలా ఉండ‌గా 1200 కిలోమీట‌ర్ల మేర విస్త‌రించి ఉన్న సుడాన్‌-ఈజిప్టు స‌రిహ‌ద్దు ప్రాంతంలో బంగారం అక్ర‌మ ర‌వాణ‌, మ‌నుషుల అక్ర‌మా ర‌వాణ కూడ సాగుతోంది. దీనిని నియంత్రించేందుకు ఈజిప్టు చ‌ర్య‌లు తీసుకుంటుంది. తాజా వైమానిక దాడి సరిహద్దు ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలను పెంచింది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  ప్రియుడి బెయిల్ కోసం డ్రగ్స్ దందా.. విజయవాడ రైల్వే స్టేషన్‌లో యువతి అరెస్ట్!
  2. బెంగళూరు పబ్‌ ఘటన.. ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌పై ఏపీ ప్రభుత్వం చర్యలు!
  3. ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసుల నోటీసులు.. అక్టోబర్ 28లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
  4. 400 కుటుంబాలకు అండగా రష్మిక మందన్న.. ఏడాది పాటు సేవా కార్యక్రమాలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు