Homeఆంధ్ర ప్రదేశ్వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. ఈడీ విచారణకు ఎంపీ అవినాశ్ రెడ్డి

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. ఈడీ విచారణకు ఎంపీ అవినాశ్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి నమోదైన మనీలాండరింగ్ ఆరోపణలపై వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి వెలుగులోకి వచ్చిన ఆర్థిక లావాదేవీలు, నిధుల బదిలీలపై ఈ విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.

రూ.40 కోట్ల డీల్ ఆరోపణలపై ఆరా!

వివేకానంద రెడ్డి హత్య కేసులో రూ.40 కోట్ల డీల్ జరిగిందన్న ఆరోపణలు దర్యాప్తులో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో హత్యకు ముందు, ఆ తర్వాత చోటుచేసుకున్నట్లు చెబుతున్న ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఈ లావాదేవీల వెనుక ఉన్న వ్యక్తులు, నిధుల మూలాలు, డబ్బు ఎవరెవరికి బదిలీ అయిందనే అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ చేపట్టిన దర్యాప్తులో భాగంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను సేకరిస్తోంది. ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, దర్యాప్తులో సమర్పించిన చార్జిషీట్ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలిస్తోంది.

గత లావాదేవీలపైనా దర్యాప్తు

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు నిందితులు, అప్రూవర్లుగా మారిన వ్యక్తులను ఈడీ అధికారులు విచారించినట్లు సమాచారం. ముఖ్యంగా 2019 నుంచి జరిగిన బ్యాంకు లావాదేవీలు, నగదు బదిలీలు, ఇతర ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో హైదరాబాద్‌తో పాటు కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు, లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్లు గతంలో వెల్లడైంది.

మరోసారి తెరపైకి వివేకా హత్య కేసు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. తాజాగా వైఎస్ అవినాశ్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కావడంతో ఈ కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. తాజా విచారణలో అధికారులు ఏ అంశాలపై ప్రశ్నించారు? ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎలాంటి వివరాలు వెలుగులోకి వస్తాయి? అనేది ఆసక్తికరంగా మారింది.

also read: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం.. రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవకు ఈడీ నోటీసులు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు