Homeసినిమాదీపికా ప్రెగ్నెన్సీపై ట్రోలింగ్‌.. లైక్‌తో గట్టి సమాధానం ఇచ్చిన నటి!

దీపికా ప్రెగ్నెన్సీపై ట్రోలింగ్‌.. లైక్‌తో గట్టి సమాధానం ఇచ్చిన నటి!

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె మరోసారి వార్తల్లో నిలిచారు. రెండోసారి తల్లి కాబోతున్న ఈ హీరోయిన్… గతంలో తన మొదటి ప్రెగ్నెన్సీపై వచ్చిన ట్రోలింగ్‌ లాగే.. ఈ సారి కూడా ట్రోలింగ్స్ ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓ కంటెంట్ క్రియేటర్ చేసిన పోస్ట్ కు ఆమె పరోక్షంగా స్పందించారు. భర్త రణ్‌వీర్‌ సింగ్‌, కుమార్తె దువాతో కలిసి ఇటీవల ఆమె మేటర్నిటీ ఫొటోషూట్‌ చిత్రాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

ఈ ఫొటోలకు సంబంధించి “ఫేక్ ప్రెగ్నెన్సీ” అంటూ వచ్చిన కామెంట్లపై ఓ కంటెంట్‌ క్రియేటర్‌ స్పందిస్తూ.. మహిళల గర్భధారణపై అనవసరమైన ఊహాగానాలు చేయడం ఆపాలని సూచించారు. ముఖ్యంగా ఒక మహిళ శరీరాకృతిని చూసి ఆమె గర్భవతి అని చెప్పడం, లేదా గర్భధారణను నకిలీదిగా పేర్కొంటూ కామెంట్లు చేయడం సరికాదని పేర్కొన్నారు.

మహిళల శరీరం, వ్యక్తిగత జీవితంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల వారు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉందని ఆ కంటెంట్‌ క్రియేటర్‌ తన పోస్ట్‌లో తెలిపారు. ఈ పోస్ట్‌కు దీపికా పదుకొణె లైక్‌ చేయడంతో అది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తనపై వచ్చిన ట్రోలింగ్‌కు నేరుగా స్పందించకుండా.. ఆ పోస్ట్‌కు లైక్‌ చేయడం ద్వారా దీపికా తన అభిప్రాయాన్ని పరోక్షంగా వెల్లడించారని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

also read: విజయ్ దేవరకొండ చేతికి సీడ్ గణేశ్.. వినాయక చవితికి హీరో పిలుపు ఇదే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు