మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం RC17పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘రంగస్థలం’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ మరోసారి తెరపైకి రావడంతో సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
సుకుమార్ తన సినిమాల్లో కథతో పాటు హీరోల పాత్రలు, వారి లుక్‌లకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో RC17లో రామ్ చరణ్‌ను గత చిత్రాలకు పూర్తి భిన్నమైన స్టైల్‌లో చూపించనున్నారనే ప్రచారం ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ సినిమా కోసం చరణ్ తన లుక్‌లో మార్పులు చేసుకున్నట్లు టాక్. ముఖ్యంగా లీన్ ఫిజిక్‌తో పాటు పొడవాటి జుట్టుతో ఆయన కనిపించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ లుక్‌కు సంబంధించిన అధికారిక వివరాలు చిత్రబృందం నుంచి రావాల్సి ఉంది.
గతంలోనూ విభిన్న పాత్రల కోసం రామ్ చరణ్ తన శరీరాకృతి, హెయిర్‌స్టైల్‌లో మార్పులు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో మరోసారి డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారనే వార్త మెగా అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ పెంచుతోంది.
RC17 కథాంశం, చరణ్ పాత్ర స్వభావం, ఆయన లుక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడైతే ఈ సినిమాపై మరింత హైప్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మాత్రం చరణ్ కొత్త అవతారం ఎలా ఉండబోతుందనే చర్చే టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.
also read: ప్రభాస్ ‘ఫౌజీ’కి అదిరిపోయే అప్‌డేట్.. యాక్షన్ సీన్లపై హాలీవుడ్ స్థాయిలో వర్క్!
