Homeక్రీడలుహార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్స్.. ఘాటుగా స్పందించిన నటి అమీషా పటేల్!

హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్స్.. ఘాటుగా స్పందించిన నటి అమీషా పటేల్!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ ప్రముఖ నటి అమీషా పటేల్ ల మధ్య డేటింగ్ నడుస్తోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై అమీషా పటేల్ స్పందించారు. తమ ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని, ఇలాంటి రూమర్లలో ఎలాంటి నిజం లేదని ఆమె తేల్చిచెప్పారు.

అసలేం జరిగింది?
ఇటీవల ముంబైలోని ఒక ప్రసిద్ధ హోటల్‌లో హార్దిక్ పాండ్యాతో కలిసి అమీషా పటేల్ ఉన్న వీడియో ఒకటి నెట్టింట తీవ్రంగా వైరలైంది. ఆ వీడియోలో అమీషా, హార్దిక్ భుజంపై చేయి వేసి తన స్నేహితులకు ఆయనను పరిచయం చేస్తూ కనిపించారు. వీరిద్దరి చొరవను చూసిన నెటిజన్లు ‘వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనడానికి ఇదే నిదర్శనం’ అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

నెటిజన్‌కు అమీషా కౌంటర్

ఓ నెటిజన్ చేసిన కామెంట్‌పై అమీషా పటేల్ తీవ్రంగా స్పందిస్తూ సెటైరిక్ సమాధానమిచ్చారు. “అవును కరెక్టే.. నేను అతడి భుజంపై చేయి వేయడం నీకు చాలా రొమాంటిక్‌గా కనిపిస్తోంది. బహుశా నీ జీవితంలో నీకు ఎలాంటి ఫీమేల్ ఫ్రెండ్స్ (మహిళా స్నేహితులు) లేకపోవడం వల్లే ఇలా మాట్లాడుతున్నావేమో” అని ఎద్దేవా చేశారు.తామిద్దరం కేవలం మంచి స్నేహితులమని, అనవసరమైన ఊహాగానాలకు ముగింపు పలకాలని ఈ సందర్భంగా అమీషా స్పష్టం చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా హార్దిక్-అమీషాల సంబంధంపై వస్తున్న రూమర్లకు తెరపడినట్లయింది.

బిగ్‌బాస్ సీజన్-10 గ్రాండ్ ఎంట్రీ: హౌస్‌లోకి అడుగుపెట్టిన 16 మంది కంటెస్టెంట్లు వీరే!

తొలిరోజే విధ్వంసం.. చీర లాగారంటూ ఎమ్మెల్యే సునీత కన్నీటి పర్యంతం!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు