Homeతెలంగాణమలక్‌పేట్ ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై సీపీ సజ్జనార్ సీరియస్

మలక్‌పేట్ ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై సీపీ సజ్జనార్ సీరియస్

క్రైం మిర్రర్ :  విధి నిర్వహణలో అలసత్వం, బాధ్యతారాహిత్యం ప్రదర్శించిన మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నరసింహపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఆయన్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో లోపాలు, అధికారిక బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పోలీసు శాఖలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఉందని, బాధ్యతారాహిత్యానికి ఎలాంటి అవకాశం ఉండదనే సందేశాన్ని ఈ చర్య ద్వారా స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ పోలీసు అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి అధికారి పూర్తి నిబద్ధతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం లేదా అలసత్వం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల్లో పోలీసు వ్యవస్థపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలంటే ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీపీ సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు శాఖ వెనుకాడదని స్పష్టం చేశారు.
also read : తరచూ నోటి పూతలు వస్తున్నాయా? కారణాలివే.. తగ్గాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు