Homeసినిమాసేవలకు ముగింపు పలికిన ‘RAW NTR’ బృందం.. అభిమానుల్లో చర్చలు రేకెత్తిన నిర్ణయం

సేవలకు ముగింపు పలికిన ‘RAW NTR’ బృందం.. అభిమానుల్లో చర్చలు రేకెత్తిన నిర్ణయం

సోషల్ మీడియాలో చురుకైన కార్యకలాపాలతో గుర్తింపు పొందిన ‘RAW NTR’ బృందం అకస్మాత్తుగా తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. నందమూరి అభిమాన వర్గాల్లో విస్తృతంగా చర్చకు దారి తీసిన ఈ నిర్ణయం, వారి కార్యకలాపాలపై అనేక సందేహాలను తెరపైకి తీసుకొచ్చింది.

ఇప్పటివరకు వివిధ ఆన్‌లైన్ క్యాంపెయిన్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బృందం, తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో, తక్షణమే కార్యకలాపాలను ముగిస్తున్నట్లు పేర్కొంటూ, తమ ప్రయాణంలో మద్దతు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. అయితే, ఈ నిర్ణయానికి గల కారణాలపై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.

ఈ ప్రకటన బయటకు రావడంతో అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై ఊహాగానాలు చేస్తున్నారు. ‘RAW NTR’ బృందం భవిష్యత్తులో మళ్లీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందా లేదా అన్నదానిపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి.

ఇక మరోవైపు, ఈ బృందంతో తమకు ఎలాంటి సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అధికారిక సమాచారం ఎప్పటికప్పుడు తమ కార్యాలయం నుంచే విడుదలవుతుందని వారు తెలిపారు. ప్రస్తుతం ఈ పరిణామం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి, అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

also read: నీట్‌ పేపర్‌ లీక్‌పై ప్రధాని కీలక ప్రకటన – ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులతో కఠిన చర్యలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు