Homeతెలంగాణగులాబీ పార్టీలో ఫోటో చిచ్చు...!

గులాబీ పార్టీలో ఫోటో చిచ్చు…!

  • హరీష్ రావు పాదయాత్రలో కనిపించని కేటీఆర్ ఫోటో

  • పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా దక్కని ప్రోటోకాల్

  • ఉద్దేశపూర్వకంగానే అంటున్న పార్టీలో ఒక వర్గం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: గులాబీ పార్టీలో విభేదాలు ఉన్నాయా? కేటీఆర్ అధిపత్యాన్ని హరీష్ రావు జీర్ణించుకోలేకపోతున్నారా? అందుకే సొంతంగా ఎదగాలని భావిస్తున్నారా? అందుకే పాదయాత్రకు సిద్ధపడ్డారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గులాబీ పార్టీలో విభేదాలు అనేది పాత మాట కానీ.. తాజాగా హరీష్ రావు పాదయాత్రలో ఒక విషయం హాట్ టాపిక్ అవుతోంది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఫోటో ఎక్కడా కనిపించకపోవడం విభేదాలు పతాక స్థాయికి చేరినట్లు ప్రచారం నడుస్తోంది.

కెసిఆర్ చిన్న ఫోటోతో…

Also Read:ప్రభుత్వ ఉద్యోగం రాలేదని గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య… హృదయ విదారక ఘటన

కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసి.. మిగతా ప్రాజెక్టులు నింపాలని డిమాండ్ చేస్తూ అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక సాగర్ వరకు మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రకు సంబంధించి భారీగా ఏర్పాటు జరిగాయి. భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, జండాలతో హరీష్ పాదయాత్ర సాగింది. కానీ వాటిలో ఎక్కడా కేటీఆర్ ఫోటో లేదు. భారీ సైజులో హరీష్ రావు, చిన్న సైజులో కేసీఆర్ ఫోటోతో మాత్రమే అవి కనిపించాయి. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఫోటో వేయడం కనీసం ప్రోటోకాల్. కానీ ఫోటో లేకుండా కావాలనే చేశారనేది పార్టీలో ఒక వర్గం అభిప్రాయం.

ముందుగా పాదయాత్ర…

Also Read:ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్తుండగా విషాదం: ఇద్దరు కళాకారులు మృతి, కుటుంబాలకు టీటీడీ అండ

రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధపడుతున్నారు కేటీఆర్. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ అవుతోంది. ఈమధ్య సంగారెడ్డి జిల్లా రైతాంగానికి అండగా ఉండేందుకు సంగమేశ్వర టు బసవేశ్వర ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేస్తానని హరీష్ రావు ప్రకటించారు. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ప్రాజెక్టుల వద్ద పాదయాత్ర చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ జెండాలో కేటీఆర్ ఫోటో లేకుండా చేశారన్న విమర్శ ఉంది. పార్టీలో హరీష్ రావు వర్సెస్ కేటీఆర్ అన్నట్టు పరిస్థితి మారింది. బయటకు అంతా బాగానే కనిపిస్తున్న.. లోలోపల విభేదాలు మాత్రం ఉన్నట్లు అర్థం అవుతుంది.

తగ్గిన ప్రాధాన్యత…

Also Read:బుల్లితెర నటి జెన్నిఫర్ వింగెట్ కొత్త జీవితానికి శ్రీకారం… రెండో పెళ్లిపై అధికారిక ప్రకటన!

పార్టీలో కేటీఆర్ కంటే హరీష్ రావు సీనియర్. ఉద్యమ సమయంలో కేసీఆర్ కు అండగా నిలబడ్డారు హరీష్ రావు. కానీ కేటీఆర్ ఎంట్రీ తో హరీష్ రావు ప్రాధాన్యత పార్టీలో తగ్గినట్లు విమర్శలు వచ్చాయి. ఆ పార్టీలో విభేదాలు పతాక స్థాయికి చేరినట్లు కూడా ఆ మధ్యన ప్రచారం జరిగింది. భారతీయ జనతా పార్టీ హరీష్ రావు ద్వారా గులాబీ పార్టీని చీల్చుతుందని టాక్ నడిచింది. కానీ అటువంటిదేమీ లేదు. అయితే పార్టీలో తన బలం తగ్గకుండా ఉండేందుకు హరీష్ రావు ఎప్పటికప్పుడు బలప్రదర్శనకు దిగుతున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా పాదయాత్రలో తన ప్రాధాన్య తగ్గకూడదని కేటీఆర్ ఫోటోను హరీష్ రావు పక్కన పెట్టించారు అని ఆరోపణ వస్తోంది. గులాబీ పార్టీ శ్రేణులు కేటీఆర్ తో పాటు హరీష్ రావును కృష్ణార్జునులతో పోల్చుతారు. కానీ ఆధిపత్య పోరు మాత్రం కొనసాగుతోంది. హరీష్ రావు వైఖరి నచ్చక కవిత పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు అన్న విమర్శ ఉంది. ఇప్పుడు కేటీఆర్ ఫోటో లేకుండా చేయడం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ముందు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో నన్న ఆందోళన గులాబీ పార్టీలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు