Homeతెలంగాణఫ్యూచర్ సిటీలో అమెజాన్ మెగా ప్రాజెక్ట్.. రూ.60 వేల కోట్ల డేటా సెంటర్‌కు సీఎం రేవంత్...

ఫ్యూచర్ సిటీలో అమెజాన్ మెగా ప్రాజెక్ట్.. రూ.60 వేల కోట్ల డేటా సెంటర్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

తెలంగాణ ఐటీ రంగంలో మరో భారీ ముందడుగు పడింది. హైదరాబాద్ శివార్లలో అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) భారీ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

సుమారు రూ.60 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ డేటా సెంటర్ తెలంగాణలోనే కాకుండా దేశంలోని అతిపెద్ద డిజిటల్ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలవనుంది. రాష్ట్ర ఐటీ, టెక్నాలజీ రంగ అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమానికి పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం, డిజిటల్ ఎకానమీని బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్ట్ ప్రత్యేక పాత్ర పోషించనుంది.

అమెజాన్ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంలో ఈ ప్రాజెక్ట్ మరో కీలక అడుగుగా మారనుంది.

also read: ఆమిర్ ఖాన్ పెళ్లిపై వివాదం.. మత వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు