HomeసినిమాTrisha: కుక్క ఫోటో, ఒక్క క్యాప్షన్.. గాసిప్ బ్యాచ్‌ కు చెంప చెల్లుమనిపించేలా త్రిష పంచ్!

Trisha: కుక్క ఫోటో, ఒక్క క్యాప్షన్.. గాసిప్ బ్యాచ్‌ కు చెంప చెల్లుమనిపించేలా త్రిష పంచ్!

నటి త్రిష మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్స్‌ కు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. గత కొంతకాలంగా ఆమెతో పాటు తమిళనాడు సీఎం, ప్రముఖ నటుడు విజయ్ కలిసి వార్తల్లో నిలుస్తోంది. ఇద్దరూ తరచూ కలిసి కనిపించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

అజిత్ ను పరామర్శించేందుకు వెళ్లిన విజయ్, త్రిష

ఇటీవల నటుడు అజిత్ కుమార్ తల్లి మరణించడంతో పరామర్శించేందుకు విజయ్, త్రిష కలిసి వెళ్లారు. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో ఇద్దరిపై మరిన్ని చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లో చురుకుగా ఉన్న నేపథ్యంలో, త్రిషతో కలిసి కనిపించడం ఆయన ఇమేజ్‌పై ప్రభావం చూపుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు విజయ్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని త్రిషకు దూరంగా ఉండాలని సూచిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.

ట్రోలర్స్ కు సూపర్ పంచ్

అయితే, ఇలాంటి విమర్శలు, ట్రోల్స్ కొత్తేమీ కాదని త్రిష గతంలోనే పలుమార్లు చెప్పింది. తన వ్యక్తిగత జీవితంపై వచ్చే వ్యాఖ్యలకు ఆమె తరచూ పరోక్షంగా స్పందిస్తూ ఉంటుంది. ఈసారి కూడా అదే తరహాలో ఒక పోస్ట్‌ తో ట్రోలర్స్‌ కు కౌంటర్ ఇచ్చింది. తాజాగా త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన పెంపుడు కుక్క ఫొటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో కుక్క ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది. దీనికి ఆమె ఆసక్తికరమైన క్యాప్షన్ పెట్టింది.  “నా వ్యక్తిగత జీవితంలోకి లేదా నా విషయాల్లోకి ముక్కు దూర్చే హక్కు దీనికి మాత్రమే ఉంది” అని రాసింది.

ఈ పోస్ట్‌ ను చూసిన నెటిజన్లు దాన్ని ట్రోలర్స్‌ కు ఇచ్చిన గట్టి సమాధానంగా భావిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితంపై అనవసరంగా చర్చలు చేసే వారికి పరోక్షంగా త్రిష సందేశం ఇచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇన్‌ స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కూడా త్రిషకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు