Homeలైఫ్ స్టైల్రోజును ప్రశాంతంగా మొదలుపెట్టాలా… ఒక్క నిమిషం ఇలా చెయ్యండి..!

రోజును ప్రశాంతంగా మొదలుపెట్టాలా… ఒక్క నిమిషం ఇలా చెయ్యండి..!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: ఈ రోజుల్లో ఉదయం నిద్రలేవగానే చాలా మంది ముందుగా ఫోన్ చూస్తారు. నోటిఫికేషన్లు, పనుల జాబితా, రోజు మొత్తం చేయాల్సిన బాధ్యతలు వెంటనే గుర్తొచ్చి మనసు హడావుడిగా మారిపోతుంది. కానీ రోజును ప్రశాంతంగా, కాస్త క్లారిటీతో మొదలుపెట్టడానికి గంటల తరబడి ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒక నిమిషం సరిపోతుంది.

ఉదయం ఒక్క నిమిషం మైండ్‌ఫుల్‌నెస్ లేదా ధ్యానం చేయడం వల్ల మనసు, శరీరం నెమ్మదిగా రోజుకు సిద్ధమవుతాయి. చిన్న అలవాటు అయినా.. దాన్ని ప్రతిరోజూ పాటిస్తే రోజంతా మంచి మార్పు కనిపిస్తుంది.

రోజును పాజిటివ్‌గా ప్రారంభించొచ్చు…

ఉదయం ఒక నిమిషం ప్రశాంతంగా కూర్చుంటే మనసులో స్పష్టత వస్తుంది. తొందర, ఒత్తిడి తగ్గి రోజును హాయిగా మొదలుపెట్టే అవకాశం ఉంటుంది.లోతుగా శ్వాస తీసుకోవడం లేదా నిశ్శబ్దంగా కూర్చోవడం వల్ల మైండ్‌లోని గందరగోళం తగ్గుతుంది. దీంతో పనులపై దృష్టి బాగా ఉంటుంది.

మూడ్ మెరుగవుతుంది…

ఒక్క నిమిషం కృతజ్ఞతతో లేదా శ్వాసపై దృష్టి పెట్టడం వల్ల మనసు తేలికగా అనిపిస్తుంది. రోజును మంచి భావంతో ప్రారంభించొచ్చు. మార్నింగ్‌లో అన్నీ ఒకేసారి చేయాలనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటి సమయంలో ఒక నిమిషం బ్రేక్ తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది.

ఓవర్ థింకింగ్ తగ్గుతుంది…

లేవగానే ఆలోచనలు పరుగులు పెడితే ధ్యానం వాటిని కాస్త నెమ్మదింపజేస్తుంది. దీంతో మనసు స్థిరంగా ఉంటుంది. కాఫీతో శరీరం మేల్కొనొచ్చు. కానీ మనసు, భావోద్వేగాలు కూడా సిద్ధం కావాలి. ఆ పని ధ్యానం చేస్తుంది.

రోజును మీ నియంత్రణలో ప్రారంభించొచ్చు…

మెసేజ్‌లు, పనులు, డెడ్‌లైన్స్‌కి రియాక్ట్ కాకముందే మీ కోసం ఒక నిమిషం తీసుకోవడం వల్ల రోజును మీ పద్ధతిలో మొదలుపెట్టొచ్చు. లోతైన శ్వాస వల్ల శరీరానికి ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. దీంతో ఉత్సాహంగా, ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఒక్క నిమిషం పెద్దగా అనిపించకపోవచ్చు. కానీ దాన్ని ప్రతిరోజూ అలవాటు చేసుకుంటే మనసు ప్రశాంతంగా, ఫోకస్‌గా ఉండటానికి బాగా సహాయపడుతుంది. రోజు ఎలా మొదలవుతుందో.. చాలా వరకు అదే రోజు ఎలా సాగుతుందో నిర్ణయిస్తుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు