క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ సినిమా సెలబ్రిటీలు అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేయగా తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఖాతా వేదికగా “హ్యాపీ బర్త్డే మామయ్య గారు” అంటూ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఎన్నో విధాలుగా శుభాకాంక్షలు తెలియజేసిన మొదటిసారి చాలా ప్రేమగా ఇలా సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలియజేయడం పట్ల అభిమానులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. హ్యాపీ బర్త్డే మామయ్య గారు అంటూనే.. ఎన్నో ఏళ్ళు ఇలాగే ఆరోగ్యంగా అలాగే సంతోషంగా ఉండాలి అని.. మీ విజన్ తో ప్రజలకు మరిన్ని సేవలు కొనసాగించాలి అని కోరారు. సీఎం బర్త్డే కావడంతో ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాలలో కేక్ కట్ చేస్తూ కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ సీఎంపై అభిమానాన్ని చాటుకుంటున్నారు.
కాంగ్రెస్ “దగా” పై ధ్వజమెత్తిన బీఆర్ఎస్
India-Russia: ఒకరి దేశంలో మరొకరి సైన్యం… భారత్-రష్యా కొత్త ఒప్పందం!