Homeఅంతర్జాతీయంMojtaba Khamenei: ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ.. ఇంతకీ అసలు నిజం ఏంటి?

Mojtaba Khamenei: ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ.. ఇంతకీ అసలు నిజం ఏంటి?

ఇరాన్‌ కొత్త  సుప్రీం లీడర్‌ గా మొజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారని  ఇరాన్‌ ఇంటర్నేషనల్‌ సహా పలు అంతర్జాతీయ  వార్తాసంస్థలు వెల్లడించాయి. అయితే, ఇది నిజం కాదని ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇటీవల ప్రాణాలు కోల్పోయిన సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడే మొజ్తాబా. ఆయన వయస్సు 56 ఏళ్లు. ఇరాన్‌ రాజ్యాంగం ప్రకారం.. నిపుణుల అసెంబ్లీ సమావేశమై.. కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబాను ఎన్నుకున్నట్లుగా మీడియాలో ఊహాగానాలు చెలరేగాయి. దేశంలోని శక్తిమంతమైన  ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌(ఐఆర్‌జీసీ) మద్దతు మొజ్తాబాకు ఉందని, ఈ నేపథ్యంలోనే ఆయనకు అత్యున్నత బాధ్యతలు అప్పగించినట్లు తెలిపాయి.

ఖండించిన ఇరాన్ ప్రభుత్వం

అయితే, దీనిపై ముంబైలోని ఇరాన్‌ రాయబార కార్యాలయం ఎక్స్‌ ఖాతా ద్వారా ఇరాన్‌ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. నిపుణుల అసెంబ్లీ ఒక నాయకుడిని ఎన్నుకుందన్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది. కాగా, అయతుల్లా అలీ ఖమేనీ మీద జరిగిన దాడిలో మరణించిన పలువురిలో మొజ్తాబా భార్య జహ్రా కూడా ఉన్నారు.

ఎవరిని ఎన్నుకున్నా చంపేస్తాం!

ఇరాన్‌ కొత్త నేతగా ఎవరిని ఎన్నుకున్నా వారిని అంతమొందిస్తామని ఇజ్రాయెల్‌ రక్షణమంత్రి కట్జ్‌ వెల్లడించారు. మొజ్తాబాను ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారన్న వార్తల నేపథ్యంలో.. కట్జ్‌ ఎక్స్‌ లో ఓ పోస్ట్‌ పెట్టారు. “ఇజ్రాయెల్‌ వినాశనానికి ప్రణాళికలు అమలుపరిచేందుకు, అమెరికాను, స్వేచ్ఛాయుత ప్రపంచాన్ని, పశ్చిమాసియాలోని ఇతర దేశాలను బెదిరించేందుకు, ఇరాన్‌ ప్రజల్ని అణచివేసేందుకు ఇరాన్‌ ఉగ్రరాజ్యం ఏ నాయకుడిని నియమించినా అంతమొందిస్తాం. ఆ నాయకుడు ఎవరైనా, ఎక్కడా దాక్కున్నా పని పడతాం. ఈ మేరకు సైన్యానికి ప్రధాని నెతన్యాహు, నేను ఆదేశాలు ఇచ్చాం” అని కట్జ్‌ వివరించారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు