HomeజాతీయంNitish Kuamr: సీఎం పదవికి నితీశ్ రాజీనామా, డిప్యూటీ సీఎంగా తనయుడు!

Nitish Kuamr: సీఎం పదవికి నితీశ్ రాజీనామా, డిప్యూటీ సీఎంగా తనయుడు!

* బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు

* సీఎం పదవికి నితీశ్ రాజీనామా చేసే అవకాశం

* రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం

* డిప్యూటీ సీఎంగా నితీశ్ తనయుడు నిషాంత్ కుమార్‌

బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నితీశ్ కొడుకు నిషాంత్ కుమార్‌ బిహార్ ఉప ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరుగుతోంది. తద్వారా నితీశ్ కుమార్ స్థానంలో బీజేపీ తమ సొంత అభ్యర్థిని ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉందని చెబుతున్నారు.

జేడీయూ శాసనసభా పక్షం కీలక సమావేశం

కాగా, నిషాంత్ కుమార్‌ను రాజ్యసభకు నామినేట్ చేయవచ్చనే ప్రచారం కూడా ఇంతకుముందు జరిగింది. అయితే ఇంతవరకూ ఆయన అభ్యర్థిత్వానికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు సిద్ధం కాలేదు. నిషాంత్ కుమార్ యాక్టివ్ పాలిటిక్స్‌ లోకి అడుగుపెట్టడం ఖాయమని మాత్రం జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. బిహార్‌లో 5 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జేడీయూ రెండు స్థానాలకు గెలుచుకునే అవకాశం ఉంది. జేడీయూ శాసనసభా పక్షం కూడా గురువారం నాడు సమావేశమవుతోంది. ఈ సమావేశంలో కేంద్రంలో నితీశ్ ప్రధాన పాత్ర పోషించడానికి అంగీకరించే విషయంపై చర్చ జరగవచ్చని తెలుస్తోంది.

ఎన్డీయే కూటమికి 200 సీట్లకు పైగా..

ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 200 సీట్లకు పైగా స్థానాలను గెలుచుకుని విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ 89 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మిత్రపక్షమైన జేడీయూ 85 స్థానాలతో రెండో స్థానంలోనూ, లోక్‌జన్‌శక్తి పార్టీ (రామ్‌విలాస్) 19 స్థానాలతో మూడో స్థానంలోనూ నిలిచాయి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు