Homeక్రైమ్Online Shopping Shock: కెమెరా ఆర్డర్ పెడితే సర్ఫ్ ప్యాకెట్లు వచ్చాయి.. ఇదెక్కడి మోసం రా...

Online Shopping Shock: కెమెరా ఆర్డర్ పెడితే సర్ఫ్ ప్యాకెట్లు వచ్చాయి.. ఇదెక్కడి మోసం రా అయ్యా!

  • ఆన్‌లైన్‌లో కెమెరా ఆర్డర్ పెట్టుకున్న వ్యక్తికి షాక్
  • పార్సిల్‌లో కెమెరా బదులుగా రెండు సర్ఫ్ ప్యాకెట్లు
  • కర్ణాటకలో షాకింగ్ ఘటన

ఈ రోజుల్లో ఆన్‌ లైన్ షాపింగ్‌ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఆన్‌లైన్‌లో కెమెరా ఆర్డర్ పెట్టుకున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. పార్సిల్‌లో కెమెరా బదులుగా రెండు సర్ఫ్ ప్యాకెట్లు వచ్చాయి. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

హుబ్బళ్లికి చెందిన ఆల్‌ఫ్రెడ్ అనే వ్యక్తి దుబాయ్‌లో స్థిరపడ్డాడు. అక్కడే బిజినెస్ చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం అతడు తన సొంత ఊరికి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే తన స్నేహితుడి కోసం అమెజాన్‌లో కెమెరా ఆర్డర్ పెట్టాడు. దాని విలువ 60 వేల రూపాయలపైనే ఉంది. తాజాగా ఈ పార్సిల్ ఓ ప్రైవేట్ హోటల్ అడ్రస్‌కు వచ్చింది. అతడు వెళ్లి పార్సిల్ తీసుకున్నాడు. దాన్ని ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు. రూ.60 వేల కెమెరాకు బదులుగా రెండు సర్ఫ్ ప్యాకెట్లు కనిపించాయి. ఆల్‌ఫ్రెడ్ వెంటనే అమెజాన్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశాడు. వారినుంచి సరైన స్పందన రాలేదు.

బాధితుడు ఏం చెప్పాడంటే?

ఈ సంఘటనపై ఆల్‌ఫ్రెడ్ కీలక వివరాలు వెల్లడించాడు. “నేను దుబాయ్‌లో ఉన్నపుడు చాలాసార్లు అమెజాన్ నుంచి వస్తువులు ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ సారి నా ఫ్రెండ్ కోసం కెమెరా ఆర్డర్ పెట్టాను. కెమెరాకు బదులుగా రెండు సర్ఫ్ ప్యాకెట్లు వచ్చాయి. పార్సిల్ ఓపెన్ చేసే సమయంలో వీడియో కూడా తీశాం. ఆ సాక్ష్యం మా దగ్గర ఉంది. అయినా కూడా అమెజాన్ వాళ్లు సరిగా స్పందించటం లేదు”అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Read Also: మాజీ భర్త కిరాతకం.. ఇన్‌స్టాలో ఫోటో చూసి వెతుక్కుంటూ వచ్చి చంపాడు

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు