Homeఆంధ్ర ప్రదేశ్దేవుడంటే వైసీపీ పార్టీకి గౌరవం లేదు : మంత్రి పయ్యావుల

దేవుడంటే వైసీపీ పార్టీకి గౌరవం లేదు : మంత్రి పయ్యావుల

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతం తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనంగా మారింది. తాజాగా ఈ తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం శాసనమండలని సైతం కుదిపేస్తోంది. హెరిటేజ్ -ఇందాపూర్ పై చర్చకు అనుమతి ఇవ్వాలి అంటూ తాజాగా వైసీపీ పార్టీ సభ్యులు డిమాండ్ చేస్తూ సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలు సభలోకి తీసుకురావడంపై ప్రతిపక్ష పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే మరీ ముఖ్యంగా మంత్రి పయ్యావుల కేశవ్ వైసిపి పార్టీ సభ్యులపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. కావాలనే హిందువుల మనోభావాలను వైసిపి పార్టీ నాయకులు రెచ్చగొడుతున్నారు అని.. పదేపదే దేవుడిని ఇందులోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని కోపంలో తన హెడ్ ఫోన్ ను సైతం టేబుల్స్ కొట్టారు. సభలోకి దేవుడు ఫోటోలు తీసుకురావడం ఏంటి?.. అని సహచర మంత్రులతో కలిసి మండలి చైర్మన్ మోషన్ రాజుకు ఫిర్యాదు చేశారు. వెంటనే వైసీపీ పార్టీ సభ్యులపై చర్యలు తీసుకోవాలి అని శాసనమండలి వేదికగా కోరారు. దీంతో ఈ రాజకీయ దుమారాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలలో సైతం అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్న‌ల్‌

ప్రపంచంలోని అన్ని సమస్యలకు పరిష్కారం చూపే సత్తా మన దేశానికి ఉంది : RSS చీఫ్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments