Tuesday, March 10, 2026
Homeఅంతర్జాతీయంజపాన్ లో భయంకర భూకంపం.. టోక్యోకు సమీపంలో 7.6 తీవ్రతతో భూ ప్రకంపనలు!

జపాన్ లో భయంకర భూకంపం.. టోక్యోకు సమీపంలో 7.6 తీవ్రతతో భూ ప్రకంపనలు!

క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :- జపాన్ దేశంలో తాజాగా గంట క్రితం సమయంలో భారీ భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేల్ పై తీవ్రత 7.6 నమోదయింది అని అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ఇళ్లలోని వస్తువులు ఎక్కడికి అక్కడ పడిపోయాయి. దీంతో ఇళ్లలో ఉన్నటువంటి జపాన్ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఇక ఎక్కువగా టోక్యోకు సమీపంలో భూప్రకంపనలు వచ్చినట్లుగా సమాచారం. దీంతో ఆ దేశ అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భారీ భూకంపం నేపథ్యంలో ప్రాణ అలాగే ఆస్తి నష్టం పై వివరాలు స్పష్టం చేయాల్సి ఉంది. ఈ మధ్యకాలంలో జపాన్లో ఇలాంటి భూకంపం ప్రకంపనలు ఎన్నోసార్లు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం తీవ్రస్థాయిలో వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.

Read also : సర్పంచులను గెలిపించాల్సిన బాధ్యత మీది.. అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాది

Read also : వైరలవుతున్న తమన్నా, శ్రీలీలల బాత్రూం ఫోటోలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments