Homeతెలంగాణఇవాళ, రేపు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

ఇవాళ, రేపు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

Heavy Rains In Telangana And AP: ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. నల్లగొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, పిడుగులతో పాటు ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని తెలిపింది.

ఏపీలోపూ భారీ వర్షాలు

అటు ఎండలతో మండిపోతున్న ఏపీకి కూడా వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 23 వరకు వర్షాలు పడుతాయని తెలిపింది. గురువారం రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఇవి ఇలాగే కొనసాగనున్నట్లు తెలిపింది.  జార్ఖండ్‌, బిహార్‌లలో ఉన్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది ఉత్తర తమిళనాడు మీదుగా తూర్పు, పడమరగా మరో ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో  కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. అల్లూరి, అంబేడ్కర్‌ కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణుల ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఎక్కువచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 23వ తేదీ వరకూ వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసింది.  రానున్న 3 రోజులూ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Read Also: అన్నదాతలకు గుడ్ న్యూస్, పీఎం కిసాన్ నిధుల విడుదల ఎప్పుడంటే?

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు