Homeఅంతర్జాతీయంపాకిస్తాన్ కు చైనా స్టెల్త్ ఫైటర్స్, భారత్ కు ముప్పు తప్పదా?

పాకిస్తాన్ కు చైనా స్టెల్త్ ఫైటర్స్, భారత్ కు ముప్పు తప్పదా?

China Stealth Fighters: భారత్ ఎంత సంయమనం పాటించినా పక్కలో బల్లేలుగా తయారయ్యాయి పాకిస్తాన్, చైనా దేశాలు. సమయం దొరికినప్పుడల్లా మన మీద దాడి చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ తోక జాడించడం వెనుకు చైనా తప్పకుండా ఉంటుంది. ఇప్పటికే ఈ విషయం పలుమార్లు రుజువు అయ్యింది. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిదాడిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విషయంలోనూ, మన దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ కు మద్దతు పలికాయి చైనా, టర్కీ దేశాలు. పాకిస్తాన్ కు కావాల్సిన డ్రోన్లు, క్షిపణులు అందించాయి. వాటితో పాకిస్తాన్ భారత్ మీద దాడికి యత్నించింది.

పాకిస్తాన్ కు చైనా స్టెల్త్ ఫైటర్స్!

తాజాగా పాకిస్తాన్‌ కు 40 షెన్యాంగ్ J-35 పిఫ్త్ జెనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్‌ లను అందించబోతోంది డ్రాగన్ కంట్రీ. J-35 రాకతో   స్టెల్త్ టెక్నాలజీని కలిగి ఉన్న తక్కువ దేశాల లిస్టులో పాకిస్తాన్ చేరుతుంది. ఈ ఫైటర్ జెట్లు భారత్ కు కాస్త ఇబ్బందికరమే అని చెప్పుకోక తప్పదు. త్వరలోనే ఈ ఫైటర్ జెట్లు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

భారత్ దగ్గర నో స్టెల్త్ ఫైటర్స్!

ప్రస్తుతం భారత్ దగ్గర ఎలాంటి స్టెల్త్ ఫైటర్ జెట్లు లేవు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్వదేశీ పిఫ్ట్ జెనరేషన్ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్- అడ్వాన్స్ డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాప్ట్ ను తయారు చేసే పనిలో ఉంది. అయితే, ఇది అందుబాటులోకి రావడానికి ఇంకా దశాబ్దకాలం పట్టే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2035 నాటికి ఈ ఫైటర్ జెట్లు భారత అమ్ముల పొందిలో చేరే అవకాశం ఉందంటున్నారు.

Read Also: ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు, క్లస్టర్ బాంబులతో అటాక్!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments