Thursday, March 19, 2026
Homeతెలంగాణలైన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు నూతన అధ్యక్షునిగా కే గోవర్ధన్ రెడ్డి ఎన్నిక

లైన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు నూతన అధ్యక్షునిగా కే గోవర్ధన్ రెడ్డి ఎన్నిక

క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి:- లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు 40 అధ్యక్షునిగా కే గోవర్ధన్ రెడ్డి తో పాటు నూతన కార్యవర్గం ఈనెల 16న ప్రమాణస్వీకారం చేయనున్నట్లు లయన్స్ క్లబ్ పిఆర్ఓ పాషా శనివారం ఒక ప్రకటనలు తెలిపారు. మైసిగండి లో గల ఎమ్ ఆర్ జీ ఫంక్షన్ హాల్లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సాయంత్రం 5 గంటలకు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ 40వ అధ్యక్షునిగా 2025 – 26 సంవత్సరానికి గాను కే.గోవర్ధన్ రెడ్డి, కార్యదర్శిగా జి. శ్రీను, కోశాధికారిగా శ్రీనివాస్ రెడ్డి, పిఆర్ఓ గా ఎంఏ పాష, ఉపాధ్యక్షులుగా ఎంగలి బాలకృష్ణ, పి. వెంకట్ రెడ్డి, రాంరెడ్డి, జాయింట్ సెక్రటరీగా కొరివి. వెంకటయ్య, టేమర్ గా చేగూరి. వెంకటేష్, టెల్ ట్విస్టర్ గా మోహన్ రెడ్డి, లియో చైర్మన్ గా లయన్ ఎం. అంజయ్య, ముఖ్య డైరెక్టర్లుగా ఏం. సునంద, ఎం. చంద్రశేఖర్, బి. వెంకటేష్, బండెల రామచంద్రారెడ్డి, బైరి కరుణాకర్ రెడ్డి, జూలూరి రమేష్, అర్థం మనోహర్, కండె ఓంకారం, కసిరెడ్డి రామ్ రెడ్డి లు ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ పిఆర్ఓ పాషా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 320ఏ జిల్లా గవర్నర్, లయన్ డి. కోటేశ్వరరావు, మాజీ గవర్నర్ ఇనిస్టాలేషన్ ఆఫీసర్ గా లయన్ ఎస్ ఎస్. శ్యామ్ కుమార్, లయన్ మాజీ మల్టిపుల్ చైర్మన్ లయన్ ఎస్ నరేందర్ రెడ్డి, ఎలక్ట్ గవర్నర్ జి. మహేందర్ కుమార్ రెడ్డి, ఎల్ సి ఐ ఎఫ్ కోఆర్డినేటర్ లయన్ జి. చెన్న కిషన్ రెడ్డి, లయన్ ఫస్ట్ ఎలక్ట్ వైస్ గవర్నర్ సురేష్ జగన్నాని, మాజీ గవర్నర్ జూలూరి రమేష్ బాబు, రీజియన్ చైర్ పర్సన్ ఎస్. జనార్దన్ రెడ్డి, జోన్ చైర్ పర్సన్ జూలూరు లింగయ్య, మాస్టర్ సెర్మని డాక్టర్ వి. దామోదర్ రెడ్డిలు హాజరవుతున్నట్లు పాషా తెలిపారు. అదేవిధంగా లియో క్లబ్ అధ్యక్షుడిగా శ్యాంసుందర్, సెక్రటరీగా లయన్ ఎన్. శశిధర్, ట్రెజరర్ గా లయన్ బి ధర్మేందర్ లు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆయన తెలిపారు. చార్టర్ నైట్ వ్యవస్థాపక దినోత్సవ చైర్మన్ గా ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, కో చైర్ పర్సన్ గా లయన్ చేగూరి. వెంకటేష్, లయన్ ఎండి. జహంగీర్ అలీ, లు పాల్గొని వ్యవస్థాపక దినోత్సవాన్ని దిగ్విజయం చేయాలని క్లబ్ సభ్యులు విధిగా హాజరవ్వాలని క్లబ్ పిఆర్ఓ పాషా తెలిపారు.

ఇరాన్ తో యుద్ధం.. భారత్ కు క్షమాపణలు చెప్పిన ఇజ్రాయెల్!

ఇన్ స్టాగ్రామ్ లో వేధింపులు.. నటి కల్పికపై మరో కేసు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments