Saturday, March 7, 2026
Homeక్రైమ్ఇన్ స్టాలో పంచాయితీ, బయట హత్యాయత్నం!

ఇన్ స్టాలో పంచాయితీ, బయట హత్యాయత్నం!

Noida Road Rage On Camera: సోషల్ మీడియాలో మొదలైన గొడవ బయట హత్యాయత్నానికి కారణం అయ్యింది. ఏకంగా ఓ యువకుడిని కారుతో గుద్ది పారిపోయాడు మరో యువకుడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ఈ రోజుల్లో చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. కొన్నిసార్లు ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. మరికొన్నిసార్లు  తీవ్రమైన కామెంట్స్ చేసుకుంటున్నారు. వీరిలో కనీస పరిచయం కూడా ఉండకపోవడం విశేషం. తాజాగా  ఇన్ స్టాలో ఇద్దరి మధ్య ఓ విషయంలో జరిగిన గొడవ.. ఏకంగా బయట హత్యాయత్నానికి కారణం అయ్యింది. తనతో వాదించిన యువకుడిని ఏకంగా కారుతో గుద్ది పారిపోయే వరకు వచ్చింది. ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.

Read Also: కోరిక తీర్చలేని భార్యకు నిప్పు పెట్టిన సైకో భర్త.. మరీ ఇంత ఘోరమా?

మహీంద్రా థార్ తో ఢీకొట్టిన యువకుడు

తాజాగా నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహీంద్రా థార్ ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు ఎగిరి మురికి కాల్వలో పడ్డారు. ఈ ఘటనతో స్థానికులు షాకయ్యారు. ఆ తర్వాత ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులకు అసలు విషయం తెలిసి షాకయ్యారు. ఈ ఘటనకు రీసెంట్ గా ఇన్ స్టాలో జరిగిన గొడవే కారణం అని తేల్చారు. నెట్టింట ఇద్దరి మధ్య చెలరేగిన వివాదంతోనే ఈ యాక్సిడెంట్ చేసినట్లు గుర్తించారు. ఇద్దరికి ఒకరికొకరు తెలియడంతో కోపంతో సదరు యువకుడికి హాని చేయాలనే ఈ యాక్సిడెంట్ చేసినట్లు పోలీసులు ADCP శుక్లా తెలిపారు. యువకుడిని కారు గుద్ది పారిపోతున్న సీసీటీవీ దృశ్యాల ద్వారా నిందితుడి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, క్రిమినల్ సెక్షన్లు కూడా యాడ్ చేసినట్లు వెల్లడించారు. నిందితుడిని ప్రత్యేక బృందాలు గాలించి పట్టుకున్నట్లు శుక్లా వెల్లడించారు.

Read Also: 3 గంటల పని .. 50 వేల జీతం.. సీన్ కట్ చేస్తే లబోదిబో!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments