కోరిక తీర్చలేని భార్యకు నిప్పు పెట్టిన సైకో భర్త.. మరీ ఇంత ఘోరమా?

0
162
Mumbai Horror Man arrested for setting wife on fire
Mumbai Horror Man arrested for setting wife on fire

Mumbai Horror: మనుషులు రోజు రోజుకు సైకోల్లా మారిపోతున్నారు. బయటి వాళ్లే కాదు, ఇంట్లో వాళ్లూ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా భార్య శృంగారానికి ఒప్పుకోలేదని ఓ భర్త రెచ్చిపోయాడు. ఏకంగా ఆమెకు నిప్పుపెట్టాడు. ఈ ఘటన ముంబైలో సంచలనం కలిగించింది. ప్రస్తుతం హాస్పిట్లలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కిరోసిన్ పోసుకున్న భార్య, నిప్పటించిన భర్త

ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. బాధితురాలు, భర్త దినేష్ తో కలిసి చెంబూర్ లో నివాసం ఉంటుంది. బాధితురాలు పని మనిషిగా చేస్తోంది. పొద్దున్నే లేచి ఇంట్లో పని చేసి, పనికి వెళ్లేందుకు రెడీ అయ్యింది.  ఇంతలో దినేశ్ తన కోరిక తీర్చాలన్నాడు. పనికి ఆలస్యం అవుతుందని ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలయ్యింది. భర్త టార్చర్ తట్టుకోలేక భార్య ఒంటి మీద కిరోసిన్ పోసుకుంది. ఆమె అగ్గిపుల్లను వెలిగించేందుకు ప్రయత్నించింది.

కాగితాన్ని వెలిగించి భార్యపై విసిరిన దినేశ్

భార్య ఒంటికి నిప్పు అంటించుకునే ప్రయత్నం చేస్తుండగానే, దినేష్ దారుణానికి పాల్పడ్డాడు. గ్యాస్ స్టౌవ్ మీద కాగితాన్ని కాల్చి ఆమె మీదికి విసిరాడు. ఒక్కసారిగా బాధితురాలికి నిప్పు అంటుకుంది. బాధితురాలు మంటలతో బయటకు పరిగెత్తింది. చుట్టుపక్కల వాళ్లు గమనించి ఆమెకు అంటుకున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. వెంటనే, బాధితురాలిని హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకుని స్పాట్ కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యయత్నంతో పాటు లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.  ప్రస్తుతం సదరు మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మెట్టింటి టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య

రీసెంట్ గా యూపీలో పెళ్లైన నాలుగు నెలలకే మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం కలిగించింది. తన చావుకు భర్త కుటుంబ సభ్యులే కారణంగా అని చెప్తూ ఓ వీడియో రికార్డు చేసి సూసైడ్ చేసుకుంది. మోరాదాబాద్ కు చెందిన మహిళకు గర్భస్రావం అయ్యింది. అప్పటి నుంచి అత్తింటివాళ్ల నుంచి వేధింపులు మొదలయ్యాయి. “నువ్వు కూడా చావకపోయావా?” అని సూటిపోటి మాటలు అనడంతో మనస్థాపం చెంది ఆమె చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులను అరెస్ట్ చేశారు.

Read Also: బ్యాంకులో 59 కిలోల బంగారం మాయం, అసలేం జరిగిందంటే?