Wednesday, March 4, 2026
Homeతెలంగాణకేసీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం

కేసీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబంలో విషాదం నెలకొంది. కేసీఆర్ ఐదవ సోదరి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేనత్త చీటీ సకలమ్మ మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ సోదరి.. ఈ ఉదయం కన్నుమూశారు.

చీటి సకలమ్మ భర్త నర్సింగరావు సిరిసిల్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నారు. సకలమ్మ మృతితో కేసీఆర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఎర్రవెళ్లి ఫాంహౌజ్ లో ఉన్న కేసీఆర్.. మధ్యాహ్నం సిరిసిల్లకు వెళ్లి సోదరి మృతదేహం దగ్గర నివాళి అర్పించనున్నారు. మేనత్త మరణవార్త తెలిసిన వెంటనే కేటీఆర్, కవితలు సిరిసిల్లకు వెళ్లారు. మాజీ మంత్రి హరీష్ రావుకు సకలమ్మ చిన్నమ్మ

RELATED ARTICLES

Most Popular

Recent Comments