Wednesday, March 4, 2026
Homeక్రీడలుఆట మధ్యలో ఘోరంగా కొట్టుకున్న ప్లేయర్లు!... కారణం ఏంటంటే?

ఆట మధ్యలో ఘోరంగా కొట్టుకున్న ప్లేయర్లు!… కారణం ఏంటంటే?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-
మైదానంలో కబడ్డీ కబడ్డీ అని ఆడుకోవాల్సిన మహిళా ప్లేయర్లు ఘోరంగా ముష్టి యుద్ధాలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పడి చాల దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటన పంజాబ్ లో జరిగింది. నార్త్ జోన్ ఇంటర్ వర్సిటీ, ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ మహిళా చాంపియన్షిప్ 2024-25 పోటీల సందర్బంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో తమిళనాడు ప్లేయర్లతోపాటు కొంతమంది నార్త్ ప్లేయర్లకు దెబ్బలు తగిలినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అందులో ప్లేయర్లు, ప్రేక్షకులు కొట్టుకుంటూ రణరంగాన్ని తలపిస్తున్నారు. అభిమానులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తూ, షేర్ చేస్తున్నారు.

సన్యాసం తీసుకున్న అందమైన హీరోయిన్.. కుంభమేళాలో అద్భుతం

తమిళనాడుకు చెందిన మదర్ థెరిసా యూనివర్సిటీ, ధర్బంగా యూనివర్సిటీ జట్లకు మధ్య జరిగిన పోటీలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ మధ్యలో ఫౌల్ అటాక్ చేసినట్లు తమిళనాడు ప్లేయర్లు ఆరోపిస్తూ రిఫరీని సంప్రదించారు. అయితే రిఫరీ కాస్త దురుసుగా ప్రవర్తించి, తమిళనాడు ఆటగాళ్లపై దాడికి దిగినట్లు సమాచారం. దీంతో ఇరుజట్ల మధ్య కొట్లాట స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.
రూ. 55 లక్షలకు కిడ్నీ.. హైదరాబాద్ కేసులో సంచలనాలు

తమ ప్లేయర్లపై దాడి జరగడం దురదృష్టకరమని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిథి స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటూ బాగుండేనని చురకలు అంటించారు. అయితే ఈ ఘటనలో ఆటగాళ్లకు గీరుకు పోవడం, చిన్న చిన్న దెబ్బలు తప్ప తీవ్ర గాయాలు కాలేదని పేర్కొన్నారు. పోటీలలో పాల్గొన్న 36 మంది తమిళ విద్యార్థులు క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఘటన గురించి తెలియగానే కోచ్ తో మాట్లాడామని, ఆటగాళ్లకు అదనపు భద్రతా కల్పించాలని భటిండా కలెక్టర్ ను కోరినట్లు పేర్కొన్నారు.

ఢిల్లీ రాజకీయాల్లో మండుతున్న మంటలు!… గెలిచేది ఈ పార్టీయే అని తేల్చిన సర్వేలు?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments