
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడవ తేదీ నుంచి కాలేజీల బంద్ జరుగునుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్లో 900 కోట్ల రూపాయలను చెల్లించాలి అంటూ ప్రైవేట్ కాలేజీలు విధించినటువంటి డెడ్ లైన్ నేటితో ముగిసింది. డెడ్లైన్ ముగిసిన కూడా ప్రభుత్వము నుంచి సానుకూలమైనటువంటి స్పందన రాకపోవడంతో ఎల్లుండి అనగా నవంబర్ మూడవ తేదీ నుంచి నిరవధిక బంద్ కు ప్రైవేట్ కాలేజీలు సిద్ధమవుతున్నాయని సమాచారం. మొత్తం 2024 -25 సంవత్సరానికి గాను తొమ్మిది వేల కోట్లు బకాయిలు పెండింగ్ లో ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది. దసరాకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 1200 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పి కేవలం 300 కోట్లను మాత్రమే చెల్లించింది అని కాలేజ్ యాజమాన్యాలు చెబుతున్నాయి. మళ్లీ ఈరోజు వరకు మిగతా 900 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని కోరగా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతోనే ప్రైవేట్ కాలేజీలు అన్నీ కూడా నవంబర్ మూడవ తేదీ నుంచి బంద్ నిర్వహించాలని పట్టుదలతో, ఆలోచనతో ఉన్నాయి.





