తెలంగాణ

90 లక్షల ఇండ్లలో సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా,ఉద్యోగ, రాజకీయ, కుల గణన రాష్ట్రంలో ముమ్మరంగా కొనసాగుతుంది నేటివరకు 90,56,383, నివాసాలలో సర్వే పూర్తి అయింది. ఈ సమగ్ర ఇంటింటి సర్వే లో మొత్తం 1 , 16 , 14 , 349 నివాసాలలో కాగానే, ఇందులొ బుధవారం వరకు 90.56,383 లక్షలలో నివాసాలను సర్వే పూర్తించేసి 78 శాతం లక్ష్యం పూర్తిచేశారు.

రాష్ట్రంలో ములుగు జిల్లా అత్యధికంగా 97.552 నివాసాలు సర్వే చేయాల్సి ఉండగా లక్ష్యంని మించి 98,080 నివాసాలను సర్వేచేసి 100.5 శాతం సాదించి మొదటి స్థానంలో నిలిచింది, జనగాం జిల్లా 99.9 శాతం,పూర్తిచేసి రెండొ స్థానం లో నిలిచింది. నల్లగొండ 97.7 శాతం,తో తృతియ స్థానంలో వుంది. అదేవింధగా కామరెడ్డి 93.3 శాతం, మంచిర్యాల 93.2శాతం, యాదాద్రి భువనగిరి 92.3 శాతం, నిజామబాద్ 91శాతం రాజన్న సిరిసిల్ల 90.9శాతం జగిత్యాల 90.6శాతం 9 జిల్లాలో కుడా 90 శాతం పైగా సర్వేపూర్తి అయింది.

జిహెచ్ఎంసీ పరిధి లో కూడ సర్వే ప్రక్రియ ఊపు అందుకుంది జిహెచ్ ఎంసీ పరిధి లో 25,05,517 నివాసాలు సర్వే చేయల్సి వుండాగా నేటి వరకు 13,91,817 నివాసాలలో సర్వే పూర్తిచేసి 55.6 శాతం సాధించింది.ఈ సర్వే కు ప్రజల నుండి మంచి స్పందన ఉందని అధికారులు వివరించారు. 52, 493 గ్రామీణ, 40 ,901 అర్బన్ బ్లాకులుగా మొత్తం 92 ,901 బ్లాకులుగా విభజించి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతోంది. ఈ సర్వే సకాలం లో పూర్తి చేసేవిధంగా జిల్లా ఇన్ చార్జ్ అదికారులు కలెక్టర్ లు ఎప్పటిప్పుడు సమిక్షించి తగిన చర్యలు తీసుకుటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button