
Flights Diverted: రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విమానాల ల్యాండింగ్ లో సమస్యలు తలెత్తుతుండటంతో అధికారులు పలు విమానాలను దారి మళ్లించారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఆయా విమానాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు.
మొత్తం 9 విమానాల దారి మళ్లింపు
ఇప్పటి వరకు 8 విమానాలను దారి మళ్లించినట్లు శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. వీటిలో పలు దేశీయ, అంతర్జాతీయ రాకపోకలు కొనసాగించే విమానాలు ఉన్నట్లు వెల్లడించారు హైదరాబాద్ కు రావాల్సిన విమానాలను విజయవాడ, బెంగళూరు, తిరుపతికి మళ్లించినట్లు ప్రటించారు. విజయవాడకు 5, బెంగళూరుకు 3, తిరుపతికి ఒక విమానాన్ని మళ్లించినట్లు తెలిపారు.
పలు విమానాలు రద్దు
అటు హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన పలు విమానాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నగరాన్ని మొత్తం కారు మేఘాలు కమ్మేశాయి. ఈ క్రమంలోనే విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
Read Also: భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు