ఆంధ్ర ప్రదేశ్క్రైమ్

68 లక్షల కేజీల కల్తీ నెయ్యి.. 250 కోట్లు ప్రాఫిట్.. ఇందులో జగన్, వైవీ వాటా ఎంతని టీడీపీ ప్రశ్నలు!

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ నాయకులు భక్తులకు ప్రసాదంగా ఇస్తున్న లడ్డుల తయారీలో కల్తీ నెయ్యి సరఫరా అవుతుంది అని ఆరోపించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా తెలుగుదేశం పార్టీ సంచలన ప్రకటన చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏకంగా 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేసింది. దాదాపు రెండు సంవత్సరాలు పాటు లడ్డు పవిత్రత దెబ్బ దెబ్బతిన్నదని వెల్లడించారు. ఈ 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి విలువ దాదాపు 245 కోట్లకు పైగానే ఉంటుంది అని అంచనా వేశారు. అంటే మిగతావన్నీ కలిపి దాదాపు 250 కోట్లకు పైగా కల్తీ నెయ్యి కుంభకోణం జరిగింది అని వివరించారు. మరి ఇందులో మాజీ ముఖ్యమంత్రి జగన్ వాటా ఎంత?.. తన బాబాయ్ వై.వి సుబ్బారెడ్డి వాటా ఎంత?.. అని ప్రశ్నించింది. మరోవైపు అసలు ఇది కమిషన్ కోసమే ఇలా చేశారా లేక ఈ కల్తీ నెయ్యి వెనుక ఇంకేమైనా కుట్ర ఉందా?.. అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ట్వీట్ చేసింది. దాదాపు రెండు సంవత్సరాలు పాటు లడ్డు పవిత్రత దెబ్బ తినడంతో.. ప్రజలు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కోట్ల మంది నమ్మేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలా లడ్డు కల్తీ నెయ్యి జరగడం పాపం కాదా అని ప్రశ్నించింది.. ఆ దేవుడు కూడా అలాంటి పాపాలు చేసే వారిని ఊరికి వదిలిపెట్టడు అని… అందుకే ఇంత ఘోరపరాజయాన్ని పొందారు అని తెలిపింది.

Read also : బిగ్ బ్రేకింగ్ న్యూస్.. చేపల లోడుతో వెళ్తున్న లారీ బీభత్సం.. ఆరుగురు మృతి!

Read also : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నిరాశ పరుస్తున్న పోలింగ్ శాతం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button