
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్ ఫస్టియర్ మరియు సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఫలితాలు వచ్చిన 24 గంటలు గడవకముందే ఏకంగా ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షలలో ఫెయిల్ అయ్యాము అన్న మనస్థాపంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటర్ ఫస్టియర్ లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిందని హయత్ నగర్ కు చెందిన అరుంధతి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. కెమిస్ట్రీలో ఫెయిల్ అయినందుకు బంజారాహిల్స్ లోని మరో విద్యార్థి నిష్టా ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బల్కంపేటలో మరొకరు, పెద్దపల్లి జిల్లాలో మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు మరణించారు. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో నిలిచిపోయారు. ఒక పరీక్ష మాత్రమే జీవితం అనుకొని అర్ధాంతరంగా ప్రాణాలు వదిలారు ఈ యువ కెరటాలు. ఫెయిల్ అయితే మళ్లీ సప్లమెంటరీ పరీక్షలు రాయచని ఎన్ని విధాలుగా తెలిపిన కూడా విద్యార్థులు పట్టించుకోవట్లేదు. చదివే ఇష్టం లేకపోతే ఏదో ఒక నచ్చిన పని చేసుకుని బతకొచ్చు కానీ.. లేనిపోని భయ్యాలతో ఇలా ప్రాణాలు వదిలేసి మంచి పద్ధతి కాదని అధికారులు చెబుతున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే చావే పరిష్కారమా… ఆలోచించు నేస్తమా … కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చడం న్యాయం కాదు… ఒకసారి ఆలోచించండి.