
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-
మహేశ్వరం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి, ఐటీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు పర్యటన రేపు మహేశ్వరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారని కేఎల్ఆర్ చెప్పారు.
ఇవాళ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, డీసీపీ సునీతారెడ్డి సహా పోలీస్ విభాగాధిపతులతో కలిసి మంత్రి పర్యటన స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… ఫోర్త్ సిటీతో మహానగరంగా మారే ఈ ప్రాంతంలో ఆధునిక హంగులతో డీసీపీ కార్యాలయం నిర్మించనున్నాట్లు తెలిపారు.
సింగర్ కల్పన ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసింది..? విచారణలో విస్తుపోయే వాస్తవాలు..!
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు కేఎల్ఆర్.జెన్నాయిగూడలో ప్రపంచ స్థాయి హంగులతో ఏర్పాటు కానున్న లెన్స్ కార్ట్ పరిశ్రమ భూమిని పరిశీలించారు.ఈ పరిశ్రమలో స్థానికులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని లెన్స్ కార్ట్ ప్రతినిధులను కిచ్చెన్నగారు కోరారు.
ప్రభుత్వ భూమిలో జరిగిన ఆక్రమణలను వెంటనే తొలగించాలని పోలీసులకు సూచించారు కేఎల్ఆర్.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు నరసింహ, బొక్క జంగారెడ్డి, ఏనుగు జంగారెడ్డి, కృష్ణానాయక్, కాకి ఈశ్వర్ ముదిరాజ్, సుభాన్ యాదవ్, సరికొండ పాండు సహా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
రెండో’ ప్రాధాన్యత ఓట్లే కీలకం.. ఎవరిదో విజయం!
11 రోజులైనా దొరకని కార్మికులు.. టన్నెల్ లోనే రెస్క్యూ టీమ్స్