చైనాను కకావికలం చేస్తున్న HMVP వైరస్ వేగంగా విస్తరిస్తోంది. భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక్కరోజే మన దేశంలో ఆరు చైనా వైరస్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. భారత్ లో HMPV కేసులు పెరిగిపోతున్నాయి. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్,పశ్చిమ బెంగాల్ లో HMPV కేసులు నమోదు అయ్యాయి. కర్ణాటక బెంగుళూరులో రెండు, తమిళనాడు చెన్నైలో రెండు ,గుజరాత్ అహ్మదాబాద్ లో ఒకటి,పశ్చిమ బెంగాల్ కతా ఒక కేసు నమోదైంది. ఆరు కేసుల్లోనూ చిన్న పిల్లలే బాధితులుగా ఉన్నారు. ఈ వైరస్ పిల్లల్లోనే ఎక్కువ వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
HMPV కేసులపై WHO తో సంప్రదింపులు జరుపుతోంది భారత ప్రభుత్వం. చైనా అత్యవసర ఆరోగ్య పరిస్థితిని ప్రకటించింది. చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నా యి ఇన్‌ఫ్లుఎంజా A, HMPV, మైకోప్లాస్మా న్యుమోనియా COVID-19తో సహా పలు వైరస్‌లు. HMPV లక్షణాలు.. దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, గురక, శ్వాస ఆడకపోవడం, దద్దుర్లు. ఈ లక్షణాలు ఉంటే వెంటనే హాస్పిటల్ కు వెళ్లాలని డాక్టరు సూచిస్తున్నారు.