
Rains In India: గతంతో పోల్చితే ఈసారి ముందస్తుగానే రుతుపవనాలు వచ్చినా, ఇప్పుడు వర్షాలే కరువయ్యాయి. వానలు పడాల్సిన సమయంలో ఎండలు మండుతున్నాయి. మేలో మాదిరిగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉక్కపోతతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. అల్పపీడనం ఏర్పడితే రుతుపవనాల్లో కదిలిక వచ్చే అవకాశం ఉందన్నారు.
ఉభయ రాష్ట్రాల పరిస్థితి ఏంటి?
ఇక తెలంగాణలో మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు పడుతాయన్నారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయన్నారు. వచ్చే రెండు మూడు రోజుల్లో దక్షిణాదిన రుతుపవనాలు బలపడతాయన్నారు. అటు ఏపీలోని ఈనెల 17 నుంచి రాష్ట్రంలో వర్షాలు పడనున్నాయి. 18 నుంచి మూడు రోజులపాటు విస్తారంగా పడతాయన్నారు.
దేశ వ్యాప్తంగా వర్షాలు
అటు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం కారణంగా ఆరు రోజులపాటు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 16 నుంచి 17 వరకు చెన్నై సహా ఆరుజిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ వాయుగుండం కారణంగా ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. చెన్నై, తిరువళ్లూరు సహా 6 జిల్లాల్లో ఈ నెల 16 నుంచి 17 వరకు కుండపోతగా వర్షాలు కురుస్తాయన్నారు. ఈ నెల 18న సముద్రతీర ప్రాంతాల్లోను, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లోను ఉరుములు, మెరుపులతో ఓమోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. సముద్రపు అలలు ఉధృతంగా ఎగసిపడే అవకాశాలున్నట్లు తెలిపారు. జాలర్లు చేపల వేటకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Read Also: రంగంలో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత.. ఏం చెప్పారంటే?