విజయవాడను వరద ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. వారం రోజులుగా వరదలోనే ఉన్నాయి వందలాది కాలనీలు. సీఎం చంద్రబాబు సహా మంత్రులు, అధికారులు శ్రమించడంతో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. జనాలు తమ ఇండ్లకు వెళ్లి ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే వరుణుడు మళ్లీ రంగంలోకి దిగాడు. నాన్ స్టాప్ బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో విజయవాడ ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
విజయవాడ నగరంలో జోరు వాన కురుస్తోంది. 6 గంటలుగా నిర్వీరామంగా కురిసింది వాన.జోరు వానలోనే వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి.
పందిరిలలో కనపడని పండుగ సందడి. మళ్లీ వర్షం కురుస్తుండటంతో సింగ్ నగర్ పరిసర ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. అప్రమత్తమైన అధికారులు సహాయచర్యలు చేపట్టారు. 6 గంటలు భారీ వర్షం కురవడంతో అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఈ రాత్రికి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు విజయవాడ కలెక్టరేట్‌కు వచ్చారు సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. వారం రోజులుగా కలెక్టరేట్‌లోని బస్సులో సీఎం చంద్రబాబు బస చేస్తున్నారు. వరద సహాయక కార్యక్రమాలను అక్కడి నుంచే పర్యవేక్షిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు.
విజయవాడలోనే ఉన్నా.. వారం తర్వాత చంద్రబాబు కలిశారు భువనేశ్వరి.