జైశ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగిన కాళేశ్వరం
క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి ప్రతినిధి: జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరం గ్రామంలో హనుమాన్ మాలధారణ కార్యక్రమం అంగరంగ వైభవంగానిర్వహించారు .కాళేశ్వరంలోని విరాంజనేయస్వామి దేవాలయంలో అర్చకులు మాడుగుల బాపు శర్మ మరియూ పవన్ శర్మ ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందల హనుమాన్ భక్తులు అర్ధమండల (21రోజుల) దీక్షలు తీసుకున్నారు.
ఈ సందర్బంగా బాపు శర్మ మాట్లాడుతూ హనుమంతుడు అంటే అచంచలమైన భక్తి, అపారమైన శక్తి, , వినయానికి నిలువెత్తు రూపం. ఆయన శివుని 11వ రుద్రావతారం, ఏడుగురు చిరంజీవులలో ఒకరైన ఆంజనేయుడు, శ్రీరామ కార్యసాధకుడిగా, బుద్ధిమంతుడిగా, భక్తుల కష్టాలను తొలగించే సంకటమోచనుడిగా కీర్తించబడతాడు అని అన్నారు. మాలదారణలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
