తెలంగాణ
Trending

400 కోట్లు ఇవ్వనందుకే నాగార్జున భవనం కూల్చేశారా?

తెలంగాణలో హైడ్రా బుల్డోజర్ యాక్షన్ దేశవ్యాప్తంగా సంచలమైంది. చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టిన భవనాలను నేలమట్టం చేస్తోంది హైడ్రా. హైదరాబాద్ లోని దాదాపు 26 ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా.. వందల సంఖ్యలో భవనాలను కూల్చేసింది. 111 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. అయితే మాదాపూర్ తుమ్ముడికుంట చెరువులో హీరో అక్కినేని నాగార్జున నిర్మించిన ఎన్ కన్వేన్షన్ ను కూల్చివేయడం పెను సంచలనమైంది. నగరంలో చెరువుల్లో కట్టిన భవనాలు వేలల్లో ఉండగా.. హీరో నాగార్జున కన్వేన్షన్ ను ఎందుకు పడగొట్టారన్న దానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.

హీరో నాగార్జున కేసీఆర్ ఫ్యామిలీతో క్లోజ్ గా ఉండటం వల్చే ఆయన భవనం కూల్చేశారనే వాదన కొందరు చేశారు. ఏపీ మాజీ సీఎం జగన్ ఫ్రెండ్ కాబట్టే.. తన గురువు సీఎం చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే హీరో నాగార్జునను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మురళీమోహన్ జయభేరీకి నోటీసులు ఇచ్చి సమయం ఇచ్చిన హైడ్రా.. నాగార్జున విషయంలో అలా ఎందుకు చేయలేదనే ప్రశ్నలు బయటికి వచ్చాయి. కసితోనే నాగార్జునను కావాలనే రేవంత్ టార్గెట్ చేశారనే టాక్ వచ్చింది.

తాజాగా హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. హైడ్రా పేరుతో బెదిరించి సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్ల రూపాయలు వసూల్ చేస్తున్నారని సుమన్ చెప్పారు. అక్కినేని నాగార్జునను 400 కోట్లు అడిగితే ఇవ్వనందుకే నాగార్జునకు సంబంధించిన N Conventionను రేవంత్ రెడ్డి కూలగొట్టారంటూ సంచలన ఆరోపణలు చేశారు బాల్క సుమన్. హైడ్రా పేరుతో నోటీసులు ఇచ్చి రేవంత్ మనుషులు కోట్లాది రూపాయలు వసూల్ చేస్తున్నారని తెలిపారు. హైడ్రాకు బీఆర్ఎస్ నేతల భవనాలు.. బీఆర్ఎస్ అనుకూల వ్యక్తుల భవనాలే కన్పిస్తున్నాయా అని బాల్క సుమన్ ప్రశ్నించారు. గండిపేట చెరువు ftlలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, కేవీపీ ఫాంహౌజ్ లు కనిపించడం లేదా అని నిలదీశారు.

Back to top button