
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ఈ మధ్యకాలంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు ఎక్కువైపోయాయి. ఒకవైపు సైబర్ మోసగాళ్లు అప్డేట్ అవుతూ మోసాలు చేస్తూ పోతుంటే… మరోవైపు ప్రజలు కూడా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో చేయని ప్రయత్నాలు కూడా లేవు. ఎలాగైనా సరే కొద్ది రోజుల్లోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచనలో ఇప్పటి ప్రజలు ఉన్నారు. ఇంకేముంది… ఇదే అణువుగా తీసుకుని సైబర్ నేరగాళ్లు కూడా భారీగానే మోసాలు చేస్తున్నారు. తాజాగా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వెల్లడించిన విషయాలను చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు. కేవలం మన భారతదేశంలో గత ఆరు నెలల్లో ఏకంగా 30 వేల మంది 1500 కోట్లకు పైగా నష్టపోయారని ఈ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సంచలన విషయాలను బయటపెట్టింది.
Read also : అలాంటోళ్లు మళ్లీ వస్తున్నారంటే… RO-KO 3.0 రీలోడెడ్..!
ఈ విషయం తాజాగా బయటపడడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఈ 30000 మంది బాధితుల్లో… 30 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న వారే ఎక్కువ ఉన్నారని స్పష్టం చేశారు. ఏకంగా 65% స్కామ్స్ ఢిల్లీ, బెంగుళూరు మరియు హైదరాబాదులోనే నమోదయ్యాయని ఇండియన్ సైబర్ క్రైమ్ కీలక విషయాలను బయటకు వెల్లడించింది. 26% మోసలతో బెంగళూరు పరిసర ప్రాంతాల ప్రజలు మోసపోయి మొదటి స్థానం లో నిలిచారని… పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో సగటున ఒక్కొక్క మనిషి ఎనిమిది లక్షల రూపాయలను నష్టపోయారని సంచలన విషయాలను వెల్లడించింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో బయటపడిన స్కామ్స్ కన్నా ఇంకా బయటపడని స్కామ్స్ చాలా ఉన్నాయి అంటూ నివేదిక వెల్లడించారు. దీంతో ఇన్వెస్ట్మెంట్స్ అని, బ్యాంక్ మేనేజర్స్ అని, ఓటిపిలు అని ఇలా ఎవరైనా అడిగితే మాత్రం ఖచ్చితంగా వాటిని ఒకటికి పదిసార్లు ఆలోచించిన తరువాతే ఏవైనా వివరాలు అందించాలి అని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 30 వేల మంది బాధితులు పోలీసులకు సమాచారం అందించారని… ఇంకా మోసపోయి ఎవరికి చెప్పుకోలేక కంప్లైంట్ చేయని వారు చాలామంది ఉన్నారు అని తెలిపారు. కాబట్టి ఈ సైబర్ క్రైమ్స్ అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పైన చాలా జాగ్రత్తగా ఉండాలి అని పోలీసులు సూచిస్తున్నారు.
Read also : బ్రేకింగ్ న్యూస్… స్కూళ్లకు సెలవులు ప్రకటించిన అధికారులు?





