సోషల్ మీడియా ఇప్పుడు పవర్ ఫుల్. రాజకీయ నాయకులైతే ఇప్పుడదే కీలకం. మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడీయా ద్వారానే జనాలకు చేరువవుతున్నారు లీడర్లు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడానికి సోషల్ మీడియానే కారణం. ఈ విషయాన్ని కేటీఆరే స్వయంగా ఒప్పుకున్నారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించినా ఓడించారని.. పేదలకు డబ్బులు పంచేకంటే.. 30 యూట్యూబ్ ఛానెళ్లు పెట్టుకుంటే మళ్లీ గెలిచేవారమని ఓపెన్ గానే చెప్పేశారు. గత ఎన్నికల్లో నిరుద్యోగులు కేసీఆర్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే చేశారు. ఆ వీడియోలు పల్లెటూర్లలోనూ తీవ్ర ప్రభావం చూపించాయి. ఇక తీన్మార్ మల్లన్న, తొలివెలుగు రఘు, వైఆర్ టీవీ రంజిత్, మహిపాల్ యాదవ్ ఛానెళ్లు కూడా కాంగ్రెస్ విజయానికి దోహదం చేశాయి.
అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాను, యూట్యూబ్ ఛానెళ్లను పెద్దగా పట్టించుకోలేదు కేసీఆర్. జనం మద్దతు ఉంటే వాళ్లతో ఏమవుతుందనే ఓవర్ కాన్ఫిడెన్సే ఇందుకు కారణమంటున్నారు. ఓటమి తర్వాత అసలు విషయం గ్రహించి ఇప్పుడు నష్టనివారణ చర్యలకు దిగారు కేటీఆర్. కాంగ్రెస్ టార్గెట్ గా ఇటీవల బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎదురుదాడి మరింత ఎక్కువైంది. అధికార పార్టీ సోషల్ మీడియా బలహీనపడగా.. బీఆర్ఎస్ సోషల్ మీడియా సీఎం టార్గెట్ గా విరుచుకుపడుతోంది. ఇదంతా కేటీఆర్ కొత్తగా క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా టీమ్ వల్లే సాధ్యమైందని తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ గా బీఆర్ఎస్ ప్రత్యేకంగా టీంలు నడుపుతోంది. దాదాపు 30 యూట్యూబ్ ఛానెళ్లను కేటీఆర్ ఏర్పాటు చేశారని అంటున్నారు. ఇందుకోసం నెలకు దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు. జర్నలిస్టులకు కూడా లక్షల్లో జీతాలు ఇస్తూ తమ కోసం పనిచేసేనా కేటీఆర్ ఒప్పించారని టాక్. అందుకే కొన్ని రోజులుగా రేవంత్ టార్గెట్ గా నెగెటివ్ ప్రచారం చేయడంలో కేటీఆర్ టీం సక్సెస్ అయిందని చెబుతున్నారు. తెలుగు స్కైబ్, జర్నలిస్ట్ శంకర్, న్యూస్ లైన్ , సిగ్నల్ టీవీ , వైఆర్ టీవీ వంటి ఛానెళ్లు జనంలోకి వెళుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇవన్ని బాగానే ప్రభావం చూపిస్తున్నాయని అంటున్నారు. దీంతో మరిన్ని ఛానెళ్లు ఏర్పాటు చేసేలా కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. సోషల్ మీడియా టీంతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమవుతూ ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇస్తున్నారని అంటున్నారు.
నితిన్, దిలీప్ లు యూట్యూబ్ ఛానెళ్లతో పాటు సోషల్ మీడియా టీంలు లీడ్ చేస్తున్నారని తెలుస్తోంది. వీళ్లిద్దరికి 30 లక్షల వేతనం ఇస్తున్నారనే టాక్ మీడియా సర్కిళ్లలో జరుగుతోంది. కేటీఆర్ డైరక్షన్ లోనే ఇటీవల రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమ్ విమర్శలు చేసినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీపై నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. రేవంత్ ను ఇరుకున పెట్టేందుకే ఆయన సోదరులు జగదీశ్ రెడ్డి, కొండల్ రెడ్డిని ట్రోల్ చేశారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రేవంత్ అన్న తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ట్రోల్ చేసింది.