ఛత్తీస్ గఢ్ అడవుల్లో తుపాకుల మోత మోగింది. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. సుక్మా జిల్లాలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో కీలక మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కరిగుండం అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు కొనసాగాయి. ఈ ఎన్ కౌంటర్‌లో ఇప్పటికే ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మరికొంత మంది మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే మృతుల సంఖ్యపై భద్రతా బలగాలలు ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటు భేజ్జి అటవీ ప్రాంతంలో డిఆర్‌జీ, సిఆర్‌పీఎఫ్ బలగాలలు మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్న నేపథ్యంలోభద్రతా బలగాలు చేరుకుంటున్నాయి.
నవంబర్ 11న ఆరుగురు మావోయిస్టులు మృతి
ఇక నవంబర్ 11న బీజాపూర్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టులకు గట్టి ఎదరుదెబ్బ తగిలింది. ఇంద్రావతి నేషనల్ పార్క్ లో డిఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, బస్తర్ ఫైటర్స్ ఆపరేషన్ కొనసాగింది. ఈ ఎదురు కాల్పులలో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. అగ్రనేతలు ఉర్మిలా (పాపా రావు భార్య), బుచన్నా కుడియామ్ హతమయ్యారు. వారి నుంచి ఇనాస్ రైఫిల్, స్టెన్ గన్, .303 రైఫిల్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు 270 మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో చనిపోయారు. ఒక అబుజ్ మాడ్ లోనే నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టు అగ్రనేతలు హతమయ్యారు.
ఈ ఏడాది 1225 మంది మావోయిస్టు లొంగుబాటు
2025లో మావోయిస్టు ఉద్యమం మరింత బలహీనపడింది. కేంద్రం దాడుల నేపథ్యంలో భారీ సంఖ్యలో క్యాడర్ ఆయుధాలు వదిలి ప్రజా జీవితంలో కలిసిపోతున్నారు. కేంద్ర హోంశాఖ డేటా ప్రకారం, 2025లో 1,225 మావోయిస్టులు లొంగిపోయారు. 680 మంది అరెస్టు అయ్యారు. 270 మంది ఎన్‌కౌంటర్లలో మృతి చెందారు. ఒక ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే 1,040 మంది సరెండర్ అయ్యారు.





