క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : ప్రస్తుత రోజుల్లో యువకులు మొబైల్ ఫోన్లకు బానిసలయ్యారు. తాజాగా పబ్జి గేమ్ ఆడటం వల్ల ముగ్గురు చిన్నారుల ప్రాణం గాల్లో కలిసి పోయాయి. పబ్జి గేమ్ ఆట పిచ్చిలో పడి ఏకంగా రైల్వేస్టేషన్లో కూర్చుని ఆడుతూ ఉండగా ట్రైన్ ముగ్గురిని ఢీకొట్టగా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. తల్లిదండ్రులు ఎవరూ కూడా పిల్లలకు మొబైల్ ఫోన్స్ చిన్నతనంలో కొనివ్వకూడదని అధికారులు తెలియజేశారు.
గేమ్ చేంజెర్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్!.. ఇక దబిడి దిబిడే?
ఇక అసలు విషయానికి వస్తే బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు పబ్జి గేమ్ ఆడటానికి రైల్వే పట్టాల దగ్గరికి వెళ్లారు. మధ్యలో డిస్టబెన్స్ కలుగుతుందని చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరీ రైలు పట్టాలపై కూర్చుని పబ్జి గేమ్ ఆడుతున్నారు. అదే సమయంలో రైలు వచ్చిన శబ్దం కూడా వాళ్ళకి వినిపించకపోవడంతో అంతే కూర్చొని గేమ్ ఆడుతుండగా రైలు వచ్చి ఒక్కసారిగా వీళ్ళ ముగ్గురిపై దూసుకెళ్లింది. దీంతో ఆ ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
రైతు భరోసా ఎగ్గొట్టేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్!
ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక ఈ విషయం బీహార్ అంతట పాకడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా పిల్లలపై తగు జాగ్రత్త తల్లిదండ్రులే తీసుకోవాలని కోరారు. ఎవరి పిల్లల్ని వారు మధ్యానికి అలాగే మొబైల్ ఫోన్స్ కు ఎడిక్ట్ అవ్వకుండా మీరే చూసుకోవాలని తల్లిదండ్రులను కోరారు. ఎవరైనా సరే ఒక పరిమితికి మించి వేటికి కూడా ఎక్కువగా బానిస అవ్వకుండా ఉండేలా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఫలించని రెస్క్యూ ఆపరేషన్!… చికిత్స పొందుతూ చిన్నారి మృతి?