
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
మహాదేవపూర్ మండలం సూరారం గ్రామపంచాయతీ కార్యాలయం నందు స్వర్గీయ శ్రీపాదరావు 26వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు చల్లరమేష్ రెడ్డి గారు జిల్లా కార్యవర్గ సభ్యులు తులసి మహేష్, నాగుల బాపురెడ్డి కారోబార్ వంగర రాజమౌళి, రాజయ్య బానక్క గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.