తెలంగాణ

రంజాన్ ఎఫెక్ట్… 24 గంటలు అన్ని షాపులు ఓపెన్!..

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ మాసం సందర్భంగా నేటి నుంచి 24 గంటలు షాపులు తెరిచే ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి 31 వ తారీకు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేసులుబాటు కల్పిస్తూ గత నెలలోనే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయగా ఇవాళ మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేశారు. అయితే షాపులు మరియు వ్యాపార సముదాయాల్లో పనిచేసే సిబ్బందికి రోజుకు 8 గంటల పాటు పనిచేయవచ్చు తెలిపింది. రోజుకు 8 గంటలు లేదా వారానికి 48 గంటలకు మించి పనిచేస్తే యాజమాన్యం ఆ సిబ్బందికి రెట్టింపు జీతం చెల్లించాలని కోరింది. సెలవుల్లో పనిచేస్తే ప్రత్యామ్నాయ లీవు ఇవ్వాలని కూడా ఆదేశించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏరియాలలో కూడా 24 గంటల పాటు షాపులు ఓపెనింగ్ అయ్యే ఉంటాయి.

సొంత పార్టీ ఏర్పాటా?… పక్క పార్టీలో చేరడమా ?? తీన్మార్ మల్లన్న ముందున్న దారి ఏమిటి???

కాగా ఈ నెల 31వ తారీఖున రంజాన్ పండుగ ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను ప్రత్యేకంగా చూస్తారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలపాటు షాపులు ఓపెన్ చేసి ఉంచాలని ఉత్తర్వులను జారీ చేశారు. ఆయా షాపులలో పనిచేసే సిబ్బందికి కూడా ఎటువంటి ఇబ్బందులు అలాగే కష్టాలు కలగకుండా రెట్టింపు జీతాలు చెల్లించాలని షాపు యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రంజాన్ మాసం పండుగ సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తుని కూడా సర్కారు ఏర్పాటు చేసింది.

దేవరకొండలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 26 లక్షలు టోకరా..

జగన్‌తో జాగ్రత్తగా ఉండండి – పార్టీ నేతలను హెచ్చరించిన చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button