
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : ఒకటి కాదు.. రెండు కాదు… 22 రకాల వంటకాలు.. వెజ్, నాన్‌వెజ్ వెరైటీలు. ఒకటికి మించి మరొకటి. పెళ్లివిందో.. ఏదైనా ఫంక్షనో అనుకునేరు. పొలిటిక్ కార్యక్రమం కోసం ఈ విందును సిద్ధం చేస్తున్నారు. అర్థం కావడం లేదా. టీడీపీ మహానాడు కోసం నోరించే వంటకాలు సిద్ధమవుతున్నాయి. మహానాడు మెనూ… సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది.
నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి ఏటా ఆయన పుట్టినరోజున.. మూడు రోజులపాటు మాహానాడు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా మే 27, 28, 29న మహానాడును ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే.. ఈసారి మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యర్థుల కంచుకోట అయిన కడపలో మహానాడు నిర్వహిస్తోంది తెలుగుదేశం పార్టీ. 2024లో భారీ మెజార్టీ రావడంతో.. ఆ జోష్‌లో ఉంది టీడీపీ. కడపలో మహానాడు నిర్వహించి.. పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సహాం నింపాలని భావిస్తోంది. పులివెందులలో మహానాడు జరిపితే… ఎలా ఉంటుందని కూడా ఆలోచించింది టీడీపీ. కానీ.. ఆ తర్వాత ఏమైదో కడపను ఫిక్స్ చేసింది. కడప జిల్లా సీకే దిన్నె మండలం చెర్లోపల్లి, పప్పాపురం గ్రామాల పరిధిలో మహానాడుకు వేదికను సిద్ధం చేసింది. ఏర్పాట్లు కూడా చకాచకా జరిగిపోతున్నాయి. వేసవి కావడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే.. వర్షం పడినా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు.
ఇక.. మహానాడు మెనూ.. ప్రస్తుతం హాట్ టాపిక్.. నోరూరించే టాపిక్ ఇదే. మహానాడు ఎప్పుడు నిర్వహించినా.. కార్యక్రమానికి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు అందరికీ పసందైన వంటలతో కడుపు నింపి పంపుతారు. అయితే… ఈ సారి మెనూ మాత్రం అదిరిపోతోంది. 22 రకాల వంటకాలు… భోజనప్రియులను రారమ్మంటున్నాయి. ఈ మెనూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహానాడు మెనూలో ఎన్ని వెరైటీ వంకటాలు ఉన్నాయంటే.. అది ఉంది… ఇది లేదు అనకుంటా. అందరినీ మెప్పించే వంటలు సిద్ధం చేస్తున్నారు. అల్పాహారం కింద ఇడ్లీ, వడ, పొంగల్, చట్నీ, సాంబారు, కారంపొడి, నెయ్యి. టీ ఇస్తున్నారు. మధ్యాహ్నం భోజనం కింద.. టమాటా రైస్, కొబ్బరి అన్నం, వెజ్ పులావ్, పుల్కా, చపాతీ, సొరకాయ పప్పు, తెల్ల అన్నం, టమోటా కాజు ములక్కాయ, గుత్తి వంకాయ కూరలు అందించబోతున్నారు. వెజ్ మాత్రమేనే నాన్ వెజ్ లేదా అంటే… నాన్ వెజ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి, కాజు చికెన్ కూర, గోంగూర మటన్, కోడిగుడ్డు మసాలా.. ఇంకేం కావాలి చెప్పండి. ఫైనల్‌గా ఉలవచారు, రసం, పెరుగు, అప్పడాలతో లంచ్ అయినట్టే. ఆ తర్వాత.. ఐస్‌క్రీమ్, కేక్, కూల్‌డ్రింక్స్ కూడా ఉన్నాయి. పాన్ కూడా అందిస్తున్నారు.