
క్రైమ్ మిర్రర్, ములుగు:- మావోయిస్టు పార్టీకి చెందిన 22 మంది మావోయిస్టులు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఎదుట శుక్రవారం లొంగిపోయారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం యాకన్నగూడెనికి చెందిన మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ మెంబర్ (ఏసీఎం) మడవి మాస, చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన ముచ్చకి జోగారామ్, తుమ్మిరిగూడకు చెందిన తాటి జోగా, పార్టీ దళ సభ్యులు పూనెం సుక్కు, జనతన సర్కారు కమిటీ అధ్యక్షుడు కోరం పాపారావు, సభ్యులు గౌతు హనుమయ్య, హనుమ మడవి, వెట్టి వెంకన్న, మాస సోడి, మడకం దేవా, మడవి జోగా, బిరబోయిన నారాయణ, సోడి మాసు, దూడి జయరాం, మజ్జి విజయ్, షూరిటీ రవన్న. కొత్తకొండ మజ్జి హైమవతి, కల్లూరి శాంత, కల్లూరి తిరుపతమ్మ, మజ్జి నాగరత్న, మజ్జి తిరుపతమ్మ, మజ్జి సుశీల లొంగిపోయారని తెలిపారు. “పోరుకన్నా ఊరుమిన్న.. మన ఊరికి తిరిగిరండి’ అనే కార్యక్రమం ద్వారా వీరు లొంగిపోయారన్నారు. అజ్ఞాతంలో ఉన్న దామోదర్ సహా మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం అందించే సదుపాయాలను అందిస్తామని ఎస్పీ తెలిపారు.
సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి.. ప్రగతి భవన్ ముందు అర్థనగ్న ప్రదర్శన.!