
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల క్రితం చేవెళ్ల వద్ద బస్సు ప్రమాదం చోటు చేసుకున్న సందర్భంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు అమ్మాయిలు మృతి చెందిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఆ ముగ్గురు కూతుర్ల తండ్రి ఎల్లయ్యను తాజాగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరామర్శించారు. పరామర్శించిన అనంతరం చనిపోయిన ఒక్కొక్క అమ్మాయికి 7 లక్షల రూపాయలు చొప్పున మొత్తంగా 21 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. టిప్పర్, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి ( తనుషా, నందిని, సాయి ప్రియ) ముగ్గురు కూతుర్లు మరణించగా వాళ్ల తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 20 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేస్తున్న సమయంలో కూడా ఆ ముగ్గురు కూతుర్లను మరోసారి గుర్తు చేసుకుంటూ రోదించారు. నేర్చుకుంటూనే నా రెండో కూతురు ఉద్యోగం చేస్తూ ప్రతినెలా 60000 సంపాదించేది అని.. ఈ 21 లక్షలు వారు మరణించి నాకు జీతం గా పంపించారా?.. అంటూ గుండెలు బాదుకుంటూ ఎమ్మెల్యే ముందే ఏడ్చేశారు. ఈ ఘటనతో ఎమ్మెల్యేతో సహా పక్కనున్నటువంటి అధికారులు అలాగే ప్రజలందరూ కూడా ఒక్కసారిగా బాధకు గురయ్యారు. కాగా నా ముగ్గురు కూతుర్లు చనిపోకముందు నాతో ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారని… ఉద్యోగం వచ్చాక నిన్ను అలాగే అమ్మను హైదరాబాద్ తీసుకెళ్లి బాగా చూసుకుంటాం నాన్న అని చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ తండ్రి ఎల్లయ్య తట్టుకోలేకపోయారు. పాత చొక్కా వేసుకున్నప్పుడు నా ముగ్గురు బిడ్డలు నన్ను కొత్తవి వేసుకోమని తిట్టేవారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలందరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి చేద్దామనుకున్న సమయంలో ఇలా చనిపోయారు అని గుండెలు పగిలేలా ఏడ్చారు. నష్టపరిహారం కింద 21 లక్షల రూపాయలను ఇచ్చిన.. ఆ కూతుర్లు లేని లోటు ఎవరు తీరుస్తారు అని… ఇకనైనా అధికారులు రోడ్డు ప్రమాదాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Read also : అవకాశాలు రాకపోతే… మరీ ఇంతలా దిగజారాలా రకుల్?
Read also : వరుసగా నాలుగో రోజు మూతపడిన కాలేజీలు.. 5000 కోట్లు చెల్లిస్తేనే ఓపెన్ చేస్తాం : FATHI





