Thursday, March 19, 2026
HomeజాతీయంWeather Alert: నైరుతిపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఈ ఏడాది కరువు ముప్పు తప్పదా?

Weather Alert: నైరుతిపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఈ ఏడాది కరువు ముప్పు తప్పదా?

2026 Monsoon Outlook: ఈ ఏడాది దేశంలో అనావృష్టి పరిస్థితులకు అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ఎల్‌నినో కారణమని వారు చెబుతున్నారు. భూమధ్య రేఖ ప్రాంతంలోని పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో ఏర్పడే ఛాయలు కనపడుతున్నాయని స్పష్టం చేశారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడవచ్చని కొన్ని వాతావరణ మోడళ్లు లెక్కగట్టాయి. సరిగ్గా ఇది నైరుతీ రుతుపవనాలు ఊపందుకునే సమయం. అలాగే ఉత్తరార్థ గోళంలో శీతాకాలం గరిష్ఠస్థాయికి చేరుకుంటుంది. ఈ సమయంలో ఎల్‌నినో ప్రపంచ వాతావరణంపై ప్రభావం చూపనుంది. దీని ముప్పు ఎక్కువగా దక్షిణాసియా దేశాలపై ఉంటుంది.

భారత్ లో రుపవన వర్షాలు తగ్గే అవకాశం

భారత్‌లో రుతుపవన వర్షాలు తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా, భారతఉపఖండంలోని దేశాల్లో వర్షపాతంపై తీవ్ర ప్రభావం పడనుంది అని స్కైమెట్‌ సంస్థ తొలిసారిగా అంచనా వేసింది. జూలై నెలలో ఎల్‌నినో ఏర్పడ వచ్చని, దీనితో కరువు పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ఆసియా, పసిఫిక్‌ క్లైమెట్‌ సెంటర్‌ కూడా స్పష్టం చేసింది. ఏపీసీసీ అంచనా ప్రకారం ఉష్టమండల పసిఫిక్‌ మహా సముద్రంలో గత నెల నుంచి లానినా బలహీనపడుతూ వస్తోంది. వచ్చే నెలకు పూర్తిగా బలహీనపడి తటస్థ పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఏప్రిల్‌ నెలలో తటస్థ పరిస్థితుల ప్రభావం బలహీనపడి ఎల్‌నినో మొదలవుతుంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments