పర్యాటకపరంగా ఏపీ వాసులకు అద్భత అవకాశం అందుబాటులోకి రానుంది. పచ్చని కొండల ప్రకృతి సోయగాలు.. జలమార్గం… నగరాల్లోని ఆకాశ హర్మ్యాలు.. ఇవన్నీ తిలకిస్తూ గగనవిహారం చేసే అవకాశం ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రాబోతోంది. దేశంలోనే తొలిసారి పర్యాటకంగా సీప్లేన్ వినియోగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. విజయవాడలోని పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్‌లో సీఎంతోపాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రయాణించి పరిశీలించనున్నారు..
ఎన్నో ప్రత్యేకతలు.. వినూత్న అనుభూతులు మిగిల్చే సీ ప్లేన్ ప్రయాణం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇటీవల అంతర్జాతీయ డ్రోన్ సదస్సుతో ప్రపంచ దృష్టిని రాష్ట్రం ఆకర్షించింది. సీ ప్లేన్ ప్రయాణాన్ని అందుబాటులోకి తేవడం ద్వారా మరోసారి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది.ఇందులో 14 మంది ప్రయాణించొచ్చు. ఇప్పటికే ట్రయల్‌రన్ నిర్వహించారు.
సీ ప్లేన్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సుమారు 150 కిలోమీటర్ల గగనవిహారం ఉంటుంది. భూమి ఉపరితలం నుంచి 15 వందల అడుగుల ఎత్తులో సీ ప్లేన్ ప్రయాణిస్తుంది. సాధారణంగా విమానాలు భూమికి 15 నుంచి 20 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. సీ ప్లేన్‌లు కూడా అదే స్థాయిలో ఎగిరే అవకాశం ఉన్నా.. పర్యాటకులకు ప్రకృతి అందాలను చూపించే అనుభూతి కల్పించాలన్నదే ఆలోచనగా అధికారులు చెబుతున్నారు. ఈ ప్రయాణానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ నుంచి అవసరమైన అనుమతులను అధికారులు తీసుకున్నారు.
విజయవాడ నుంచి శ్రీశైలం వరకు ప్రయాణానికి 30 నిమిషాలే పడుతుంది. ఇందులో టేకాఫ్, ల్యాండింగ్ కోసం 10 నిమిషాలు పోను.. 20 నిమిషాలు గగనంలో విహరిస్తారు. ప్రస్తుతం పున్నమిఘాట్ నుంచి నేరుగా శ్రీశైలం వెళ్లేలా రూట్‌ను అధికారులు ఎంపిక చేశారు. టేకాఫ్, ల్యాండింగ్ రెండూ నీటిలోనే ఉండడం దీని ప్రత్యేకత. సాధారణ విమానాల్లా దీనికి రన్‌వే అవసరం లేదు. దీనికోసం నీటిలో తేలియాడే జెట్టీలను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ప్రత్యేక జెట్టీని అధికారులు ఏర్పాటు చేశారు. శ్రీశైలంలో ఇప్పటికే ఉన్న జెట్టీలను తాత్కాలికంగా వినియోగించుకోనున్నారు. జెట్టీ నుంచి ర్యాంపు ద్వారా సీ ప్లేన్‌లోకి ఎక్కేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
ఈ ప్రయోగం విజయవంతమైన తర్వాత సీ ప్లేన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఛార్జీల కింద ఎంత మొత్తం వసూలుచేయాలి? రోజుకు ఎన్నిసార్లు నడపాలనే ప్రతిపాదనలను అధికారులు రూపొందించనున్నారు. టెండరు ప్రక్రియ ద్వారా గుత్తేదారు సంస్థను ఎంపిక చేసి సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని వార్తలు చదవండి ..
ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!
రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు
రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్
త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!
ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!
రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?
పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్
ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి